పర్యావరణ దినోత్సవం రాగానే అందరూ చెట్లు నాటాలీ చెట్లు నాటాలీ అనేటోళ్ళే. ఇంతకీ ఎక్కడ నాటాలి చెట్లు. ఉండేదే కాస్తంత కొంప. ఆ కొంపలో సరిగ్గా సామాన్లు పెట్టుకోవడానికే జాగా సరిపోదు. ఇంక చెట్లెక్కడ నాటేదీ. పోనీ చెట్లు నాటాము అనుకుందాం. మొక్కలు నాటుతారు కానీ చెట్లు నాటేదేంట్రా ఎదవ అంటారా? తూచ్..అది ఓల్డ్ కుళ్ళు జోకు. ఇప్పుడు చెట్లు కూడా నాటొచ్చు. పోనీ కాసేపు చెట్లో/మొక్కలో ఏదోకటి అనుకుందాం.
అసలే రియలెస్టేట్ బూమ్ భూతంలా భారీగా ఉన్న ఈ రోజుల్లో ఇంటిముందు ఓ పేద్ద చెట్టు ఉంటే ఎంత నష్టం. అది ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకుంటే అంత మేర మనం స్థలం నష్టపోవాలి. పైగా వాటివేర్లు మన ఇంటి క్రింది భాగంలోకి చొచ్చుకొని రావడం వలన ఇల్లు కూలిపోయే ఛాన్స్ కూడా ఉంది. పేద్దగా ఈదురు గాలులు వచ్చినప్పుడు అది ఎక్కడ విరిగి మన ఇంటి మీద పడుతుందోనని భయంతో చావాలి. రాలిపడిన ఆకుల్ని ప్రతిరోజూ ఎవడు శుభ్రం చేస్తాడు మీ బాబు చేస్తాడా అంటూ రిమోట్ గారు అప్పడాల కర్రతో వస్తారు. చెట్టు మీద పిట్టలన్నీ చేరి ఇంటి ముందర రెట్టలేస్తుంటే ఆ వాసన ఎవడు భరిస్తాడు. కొండకచో తెల్లచొక్కా వేసుకొని బయటికెళ్తున్నప్పుడు మన చొక్కాల మీద కూడా రెట్టవేసే ఛాన్స్ ఉంది. ప్రొద్దున్నే హాయిగా ఎనిమిదిగంటలదాకా నిద్రపోదామనుకుంటే తెల్లారి ఐదునుంచే చెట్టుమీది కాకుల గోల. అందుకే చెట్టు పక్కింటోడి స్థలంలో ఉండాలి నీడ మాత్రం మన ఇంట్లో ఉండాలి.
ఎహే...ఆ మాత్రం చెట్టు నాటడానికి స్థలానికి గతిలేనోడివి ఇంటి ముందర చిన్న చిన్న పూల మొక్కలు నాటుకోవోయ్.
పూల మొక్కలు నాటితే పాములొస్తాయ్, పశువులొచ్చి మేస్తాయ్, పక్కింటి పిల్లలొచ్చి పూలన్నీ కోసుకుపోతారు.మొక్క నాటి, నీళ్ళు పోసి ఎవరికో దానం చెయ్యడం నాకిష్టముండదు. అందుకే నేను నాట.
ఒక కుండీ కొనుక్కొని అందులో ఓ తులసి మొక్క నాటుకోరా బాబు. నువ్వూ నీ ఎదవ గోల విన్లేక ఛస్తున్నాం.
అదైతే ఓకే. ప్రస్తుతానికి అదే చేస్తున్నా. :-)

అబ్బో ఎట్లైతే ఏమి రాస్బెర్రి నీ దారికే మమ్మల్ని తెచ్చు కునావా...
ReplyDeleteఒక పని చెయ్యి ద్వారానికి మనీ ప్లాంట అల్లించు ...చల్లదనం తేడ
నీకే తెలుస్తుంది...))
శశి కళ గారు, ట్రై చేసి చూస్తాను అయితే. అయినా చల్లదనం తేడా తెలుసులెండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మామూలు మైదానం లేదా కొండ ప్రాంతం దగ్గర ఉన్న గాలికి, తమలపాకుల తోట దగ్గరికి రాగానే వచ్చే చల్లగాలిని ఎక్స్ పీరియన్స్ చేశా లెండి ఇక్కడ. :-)
Delete>>రిమోట్ గారు అప్పడాల కర్రతో వస్తారు
ReplyDeleteఎక్కడో విన్నట్టుందే!! మీరుగాని అడవుల్లో ఉంటారా రాస్బెర్రీ గారు ?
నాగార్జున గారు, అవునండి. ;-)
Delete