ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా హీరో తుపాకీ పేలుస్తూనే ఉంటాడని చెబితే చాలు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేస్తాడని. ఈ ముక్క నేనన్నది కాదు ఒక ప్రముఖ దర్శకుడు అన్నారు. బహుశా గబ్బర్ సింగ్ డైరెక్టర్ కూడా ఇదే ట్రిక్కును ఫాలో అయ్యి పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా ఒప్పించి ఉంటాడు. ఫస్టాఫ్ గురించి ఆల్రెడీ ముందు టపాలో రాసేశాను. ఓపికుంటే ముందు టపా చదివి ఇక్కడికి రండి. ఇక్కడ లింకివ్వను. ఎందుకంటే గబ్బర్ సింగ్‌ను ఫాలో అయ్యి తిక్కను తలకెక్కించుకున్నా... ఆయన ట్రెండ్ సెట్టర్ కదా మరి. ఎవడికివాడు ట్రెండ్‌ను సెట్ చేసుకుంటూ పోతే ఫాలో అయ్యేదెవడంటా...

ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌కు వెంకట రత్నం నాయుడు అని ఏదో పేరుంటాది. కానీ, బుడ్డోడు పెద్దయ్యాక "ఈ బుడ్డోడే పెరిగి పవన్ కళ్యాణ్" అయ్యాడు అని తెరమీద రాస్తాడు డైరెక్టర్...అంటే అక్కడ చూడాల్సింది సినిమాలోని క్యారెక్టర్‌ని కాదు, పవన్ కళ్యాణ్‌నన్నమాట. ఇదో కొత్త ట్రెండు సెట్టింగు...

ఫస్టాఫ్ ఫ్యాన్స్‌కు తప్ప మిగతావాళ్ళకు పరమ చెత్త. ఫస్టాఫ్ మొత్తం పవనిజం చూపించడానికే సిన్మా తీశాడు డైరెట్రు. ఆ ముక్క ఇంటర్వెల్ పడ్డప్పుడు ఆయనే చెబుతాడు. ఓరే పిచ్చనా తెలుగు సినీ ప్రేక్షకుల్లారా ఇప్పటిదాకా మీరు చూసింది సిన్మా కాదు రా అది కేవలం పవనిజం. అసలు సినిమా "ఇప్పుడే మొదలైంది" అని పవన్‍కు సైగ చేసి తుపాకీ పేల్చు నా సామిరంగా నీ ఇష్టమొచ్చినట్టు కాల్చుఅని చెప్తాడు.
అప్పటిదాకా చూసిన ప్రేక్షకులంతా పవన్ కళ్యాణ్ లాగా మెడ మీద గోక్కోలేక తల మీద గోక్కుంటుంటారు. హీరోయిన్ స్లమ్ డాగ్‌లో ఉండడమేందీ, విలన్ గాడు బురదలో దొర్లాడడమేందీ, హీరోగాడికి తిక్కేంటి వాడు పేల్చే తుపాకీ గుండ్లకు లెక్కేంటీ, చూస్తున్న మనం ఇలా బుక్కయ్యామేంటీ అని.
సరే, సోదంతా పక్కనబెట్టి సెకండాఫ్‌లోకొద్దాం.
ఇక్కడ విలన్ గురించి కూస్తంత చెప్పుకోవాలి. విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో అంత గొప్పగా ఎలివేట్ అవుతాడని త్యాగయ్యకాలం నుంచి చెప్తున్న సినిమా సూక్తి. కానీ గబ్బర్ సింగ్‌లో విలన్ "అల్లరి నరేష్" సినిమాల్లోలా కామెడీగా ఉంటాడు. ఫేస్‌లో కౄరత్వం చూపిస్తున్నాడో, కామెడీ చేస్తున్నాడో అర్థం కాదు. హీరో దెబ్బ కొట్టిన ప్రతీసారి పుడింగిలాగా ఏదో ఆలోచిస్తున్నట్టు శవాసనం ఒకటి వేస్తుంటాడు. ఆ శవాసనం కూడా వర్షంలో తడుస్తూనో, బురదలో దొర్లాడుతూనో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లోనన్నమాట. బహుశా ఈ సిన్మాలో పవన్ కళ్యాణ్ తాను హీరోని కాదు విలన్‌ని అందుకే నా పేరు "గబ్బర్ సింగ్" అని చెప్పడం వల్ల, ఇద్దరు విలన్లుప్పుడు ఎవడో ఒకడు మాత్రమే స్ట్రాంగ్‌గా ఉంటాడు అని కన్విన్స్ చెయ్యడానికి కాబోలు.
పిల్ల విలన్‌గాడికి గబ్బర్ సింగ్‌ను ఎదిరించడం చేతకాక పై ఆఫీసర్లకు స్కూల్ పిల్లాడిలా కంప్లైంట్లు చేస్తుంటాడు. వచ్చిన ఆఫీసర్లమో గబ్బర్ సింగ్ గురించి బాగా తెలిసినవాళ్ళలా ఏదో ఒక వెధవ కామెడీ చేసి పోతుంటారు. మంత్రులేమో ఆ గబ్బర్ సింగ్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోతుంది అంటారు. ఎవడికెక్కిద్ది చూసే ప్రేక్షకుడికా... ఇంద్రసేనారెడ్డి లెవెల్లో ఫ్లాష్‌బ్యాకులున్నట్లు ఒక్కోడు బిల్డప్ ఇస్తాడు. తీరాచూస్తే ఏ ఫ్లాష్ బ్యాకూ లేకుండా చివరిదాకా నడిపించాడు డైరెట్రు. కనీసం ఎక్కడా కూడా హీరోకూ, మంత్రికి, మిగతా పై ఆఫీసర్లకూ ఉన్న రిలేషన్ ఏంటో, గబ్బర్ సింగ్‌కు అంత ఫాలోయింగ్ ఎక్కడ్నుచ్చొచ్చిందో ఎక్కడా లవలేశమాత్రమైననూ వివరించే ప్రయత్నం జరగలేదు.బహుశా అదే ట్రెండ్ సెట్టింగ్ ఏమో...సమరసింహారెడ్డి నుంచి వరుసగా ఫ్యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్‌లున్న సినిమాలొస్తున్నాయి. వాటిని చూసిన ఎక్స్‌పీరియన్స్‌తో మీరే ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఊహించేసుకోండని డైరెట్రు ప్రేక్షకుని ఊహకే వదిలేశాడు. ఆహా, వ్వాటే క్రియేటివిటి.





ఇక ఊరంతా పదిలక్షలకు పైగా అప్పులు చేసి పక్కా బేవార్స్‌గా తిరుగుతున్న కొడుకు అసలు స్వరూపం ఇరవైఏళ్ళు పైగా పెంచిన తండ్రికి తెలియకపోవడమేమిటో? అంత పెద్ద రైస్ మిల్లు నడుపుతున్నాయనకు కొడుకు ఇలా అప్పులు చేస్తున్నాడు, బేవార్స్‌గా తిరుగుతున్నాడు కాస్త మందలించు అని చెప్పే శ్రేయోభిలాషులే కరువయ్యారా... పోనీ ఆ కొడుకు ఎక్కడో దూరంగా ఉండి అప్పుడప్పుడు వచ్చి పోయేటోడా తెలియకపోవడానికి అంటే అదీ కాదు. పుట్టినప్పట్నుంచీ అదే ఊళ్ళోనే పెరిగి పెద్దవాడౌతాడు. విధివశాత్తూ ఆ బేవార్సే మన గబ్బర్ సింగ్ గారి తమ్ముడన్నమాట. ఆ బేవార్స్‌ను, ఆడి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకునే కథను క్లైమాక్స్ దాకా లాక్కొచ్చాడు డైరెక్టర్... ప్చ్...
పెళ్ళి చేసుకోనని మొండికేస్తున్న హీరోయిన్‌తో ఒక చోట హీరో అంటాడు. "నేను ట్రెండ్ ఫాలో అవ్వను...సెట్ చేస్తా" అని. పెళ్ళిలో కూడా ఏం ట్రెండ్ సెట్ చేస్తాడబ్బా అని ఆసక్తిగా చూశాను కాసేపు. హుమ్మ్..." పెళ్ళిపీటల మీద హీరోయిన్ పక్కన కూర్చున్న జప్ఫా గాణ్ణి భయపెట్టేసి ఈయన చేసుకుంటాడన్నమాట". అదేనండీ రొటీన్‌గా మనం చూస్తున్న ట్రెండ్ సెట్. 


సెకండాఫ్‌లో కేవలం పవన్‌కళ్యాణే కాకుండా కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్లు రావడంతో కాస్త రిలీఫ్... అట్టాగే అత్యాంక్షరీ సీన్ మరో రిలీఫ్...కాకపోతే ఆ అంత్యాక్షరి సీన్‌ను కొద్దిగా సాగదీయడం మైనస్.

ఇంక పవన్ కళ్యాణ్ స్టెప్పుల గురించి చెప్పేదేముంది. ఎంతసేపూ అదే నడుం ఊపుడు. ఖుషీ సినిమా కాలం నుంచీ చూస్తున్నాం.సరే, ఇక్కడ మా రాజశేఖర్ మాయ్యా పవన్ కళ్యాణ్ స్టెప్పులని ఎలా ఇమిటేట్ చేస్తున్నాడో చూడండి.

ఆపవయ్యా...ఆపు...ఏం రాస్తున్నావో తెలుసా... అసలు ఇలా రాయడానికి నీకెవడు పర్మిషన్ ఇచ్చాడయ్యా.. నీకు నిర్మాతల మండలిలో సభ్యత్వం ఉందా, పోనీ కనీసం దర్శకత్వ శాఖలో అనుభవం ఉందా... సినిమాటోగ్రఫీ తెలుసా, కెమెరా ఏ యాంగిల్లో పట్టుకోవాలా తెలుసా? దీన్ని ఎవడైనా రివ్యూ అంటారా... రివ్యూ అంటే తెరమీదున్నోళ్ళ గురించే కాదు, తెరవెనుక ఉన్నోళ్ళ గురించి కూడా రాయాలి. రివ్యూ రాయడం ఒక ఫ్రొఫెషన్..అసలు రివ్యూ రాసే విధానం నీకు తెలుసా? నువ్వూ నీ పైత్యమూనూ....

యస్... నేనూ నా పైత్యమే... నేను రాసింది కూడా నా పైత్యమే...తెరవెనుక ఉన్నోళ్ళ గురించి ఫ్రొఫెషనల్స్ రాస్తారు. నేను ప్రేక్షకుణ్ణి వయ్యా... ప్రేక్షకుణ్ణి. తెరమీదున్నోళ్ళ గురించి కాస్తో కూస్తో తెలిస్తే చాలు నాకు. ఒక్కోసారి అదీ అవసరం లేదు.

సింపుల్‌గా చివరాఖరిగా సినిమా బాగుందా చూడొచ్చా అంటే చూడొచ్చు. ఈ ముక్క నా ముందు టపాలోనే చెప్పాను. ఎందుకు చూడొచ్చు అంటే చెప్పానుగా ఇట్టాంటి సైన్మాలు చూడ్డానికి మనం తియ్యడానికి వాళ్ళూ అలవాటు పడ్డారని. ఆర్నెల్లకో మూణ్ణెళ్ళకో ఒకసారి ఇట్టాంటి సినిమా హిట్టవుద్ది దాంతో ఎవడి తిక్క వాడు స్క్రీన్ మీద చూపిస్తాడు మనకు లెక్క వదిలిపోద్ది.























