లంకంత కొంప ఉంటుంది, అయినా సరే ఇంట్లో సూదిమొన మోపడానికి కూడా చోటుండదు. బీరవానిండా ఖాళీలేకుండా చీరలన్నీ మూలుగుతుంటాయి, అయినా సరే కొత్త చీరలు కొనాల్సిందే. బజార్లో దొరికే అడ్డమైన చైనా వస్తువులన్నిటినీ కొనేసి ఇంటిని మొత్తం చెత్త కుప్పగా మారుస్తారు. మళ్ళీ అది కవర్ చేసుకోవడానికి ఆ కొన్న వస్తువులన్నిటినీ ఎక్కడ చోటు దొరికితే అక్కడ సర్దేసి చూశారా ఇళ్ళు మొత్తం ఎలా సర్దామో అంటూ ఓ తెగ పన్జేసినట్టు బిల్డప్ ఇస్తూ ఇంటాయన మీద రంకెలేస్తుంటారు. ఈ పాటికే మీకు క్లియర్‍గా అర్థమయ్యుండాలి నేను ఏం మాట్లాడుతున్నానో ఎవరి గురించి మాట్లాడుతున్నానో...
ఈ ఆడలేడీస్ సైకాలజీనే అంత. చీర కొంటే రోడ్డురోలర్ ఫ్రీ అంటే చాలు, రోడ్డురోలర్ పెట్టుకోవడానికి కొంపలో చోటుందా లేదా అన్నది అనవసరం చీరని కొనిపడేస్తారు. ఇంట్లో ఎంత చోటుందో పరిగణలోకి తీసుకోకుండా దార్లో దొరికే అడ్డమైన వస్తువులన్నిటినీ కొనేసి జానెడంత కొంప ఏ మూలకూ చాల్లేదు ఓ పేద్ద బంగ్లా కొనండి అని ఒత్తిడి తెస్తుంటారు. తీరా ఆ పెద్ద బంగ్లా అయినా సరిపోతుందా అంటే ఊహూ...అది కూడా ఏ మూలకూ చాలదు. మళ్ళీ ఆ బంగ్లా క్లీన్ చెయ్యడం చేతకాక పదిమంది పనిమనుషులకు మెయెంటెనెన్స్ రూపంలో డబ్బులు బొక్క. సరిగ్గా ఈ వీక్‌నెస్‌ను క్యాష్ చేస్కోవడానికే చైనా వాడు చెత్తలో పడేసిన చెత్తనంతా మనదేశానికి తరలిస్తూ వీళ్ళ ద్వారా కొనిపిస్తున్నాడు.
అందుకే ఈ పరిణామం వల్ల దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడబోతోందని గ్రహించి, పన్లో పనిగా మగజెంట్స్ రక్షణార్థం, ఆడలేడీస్‌కు ఈ స్పేస్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ కోర్స్ ప్రారంభిస్తున్నాం.
ఈ శిక్షణ ఎలా ఉండబోతోంది, ఎంత ఫీజు తీస్కుంటారు, ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, నిర్వాహకులు ఎవరెవరు తదితర వివరాలన్నిటినీ ఈ కోర్సు ప్రారంభించడానికి ముఖ్య కారకులైన అచంగ గారిని అడగండి.

No comments:
Post a Comment