Saturday, 19 May 2012

పాలు తాగాలంటే పూరి కూడా తినాలా?


అవుననే అంటున్నారు ఈ షడ్రుచులు బ్లాగర్... పిల్లలు పాలు తాగమంటే అస్సలిష్టపడరంట... ఐస్‌క్రీమ్ లాంటివి మాత్రం సంతోషంగా తింటారంట. ఎట్టాగైనా సరే పిల్లాడి నోట్లోకి బలవంతంగా ఓ పేద్ద Hopper పెట్టైనా సరే పాలు తాగిపించాల్సిందే కాబట్టి ఈ బ్లాగర్ గారు చెప్తున్న చిట్కా ఏంటంటే పాలల్లో పూరీలు సారీ సారీ పూరీల్లో పాలు సారీ సారీ ఏదోకవిధంగా రెండింటిని మిక్స్ చేసి పాలు వాళ్ళ పొట్టలోకి పొయ్యేలా చెయ్యాలన్నమాట.

తొక్కలోది ఓ గలాసుడు పాలు వాళ్ళ బుజ్జి బొజ్జలోకి పంపడానికి ఇంత టైమ్ వేస్ట్ చేసుకొని ఇంత తతంగం చెయ్యాలా...ఇంతకన్నా సింపుల్ చిట్కాలేమీ లేవా అంటే ఉన్నాయ్... ఎందుకు లేవు బోల్డన్ని ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్పరు కాదు కాదు వీళ్ళకి తెలీదు అంతే...

అబ్బో ఆ మాత్రం చిట్కాలు తెలిస్తే నువ్వే చెప్పవోయ్, ఈ మాత్రం దానికి పక్కనోళ్ళని కెలకడం ఎందుకు అంటారా... ఓకే ఓకే చెప్తాను ఇనుకోండి. మోహన్ బాబు మాడ్యులేషన్‌లో చెప్తాను మీ చెవుల్ని కూడా అట్టాగే ట్యూన్ చేసి పెట్టుకోండి.

అ. గలాసుడు పాలల్లో హార్లిక్స్ కలిపి ఇస్తే ఇష్టపడరా?
ఆ. పోనీ బోర్నవిటా కలిపి ఇస్తే ఇష్టపడరా?
ఇ. మాల్టోవా, బూస్ట్, కాంప్లేన్ ఏది కలిపి ఇస్తే ఇష్టపడరు అని ఇక్కడ ప్రశ్నిస్తున్నా...
ఈ. అవన్నీ విదేశీ అనుకుంటే రాగిమాల్ట్ కలిపి ఇస్తే ఇష్టపడరా?
ఉ. ఎహే తొక్కలోది నేను మధ్యాహ్నం పిల్లాడికి పాలు తాగిపిస్తా అప్పుడెట్టా తాగుతాడు అంటారా...అట్టాగైతే డిఫరెంట్ ఫ్లేవర్ల్స్ ఉన్న ఐస్క్రీమ్‌తో మిల్క్‌షేక్ ఇస్తే ఇష్టపడడా?
ఊ. జ్యూసుల్లో పాలు కలుపుతారు. ఆ విధంగా ఇచ్చినా కూడా పిల్లలు పాలు ఇష్టపడరా?
ఎ. పాలతో పాయసం చేస్తే ఇష్టపడరా? పాలకోవా చేస్తే ఇష్టపడరా...

చెప్పండయ్యా ఇప్పుడు చెప్పండి. ఈ చిట్కాలు చాలా ఇంకా కావాలా? డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యులేషన్లలో ఖండించి మరీ చిట్కాలు చెప్తా...


No comments:

Post a Comment