టైమ్ రాత్రి పది గంటలు...
గిన్నెలో లీటర్ పాలు అలానే ఉన్నాయి. తాగే ఓపిక లేదు. నెక్ట్స్ డే పారబోసేవాణ్ణే.
సరిగ్గా అదే సమయంలో ఫ్రెండ్ వచ్చాడు. రాక రాక ఫ్రెండ్ వస్తే మర్యాద చెయ్యకుండా ఎలా ఉంటాం.
రండి సార్...చాలా రోజుల తర్వాత మా ఇంటికొస్తున్నారు. ఏంటీ సంగతులు
పనుండి పక్కింటికొచ్చాను సార్...పన్లో పనిగా మీ ఇళ్ళు కూడా చూసిపోదామని వచ్చాను.
అలాగా అయితే కాఫీ, టీ, బూస్ట్, రాగిమాల్ట్ etc... ఏదైనా తాగుతారా...
ఈ టైమ్‌లో పాలెక్కడివి సార్ మీకు.
ప్రొద్దున్నించీ చెడిపోకుండా కాచడమే కానీ, తాగ లేదు సార్. అందుకే ఆ లీటర్ పాలు అలాగే ఉన్నాయి.
అవునా...అయితే ఓ పని చేద్దాం సార్...
ఏం చేద్దాం సార్...
ఎలాగూ చాలా పాలున్నాయి కదా...వేస్ట్ కాకుండా పాలకోవా చేద్దాం సార్..
నా దగ్గర పాలూ, పంచదార తప్ప పాలకోవా చెయ్యడానికి మరో వస్తువు లేదు సార్...
పాలకోవా కూడా పాలూ, పంచదారతోనే చేస్తారు సార్...వేరే ఏదీ అఖ్ఖర్లేదు.
అవునా...నాకు తెలీదు... (ఎట్టా చేస్తారబ్బా...బుర్రగోక్కున్నా కాసేపు)
సరే మీరు చెయ్యండి. నేను చూస్తాను...
ఫ్రెండ్ పాలకోవా చెయ్యడం స్టార్ట్ చేశాడు. అరలీటర్ పాలు తీసుకొని వేడి చెయ్యడం స్టార్ట్ చేశాడు. ఒకపక్క పాలు వేడెక్కుతూ ఆవిరైపోతున్నాయ్...మరోపక్క పట్టువదలని విక్రమార్కుడిలా గరిట తిప్పుతూనే ఉన్నాడు. కాసేపటికి అరలీటర్లో సగానికి సగం ఆవిరైపోయాయి.
ఏం చేస్తున్నారు సార్.... పాలన్నీ ఆవిరైపోతున్నాయ్...కాసేపైతే అక్కడేమీ మిగిలేట్లు లేవు.
ఉండండి సార్...చూస్తూ ఉండండి. నేను చేసి చూపిస్తానుగా అంటూ ఒక స్పూన్ చక్కరేసి మళ్ళీ తిప్పడం స్టార్ట్ చేశాడు. కాసేపటితర్వాత మరో స్పూన్ చక్కరేశాడు. ఇంకాసేపు గరిటతో తిప్పిన తర్వాత వేడివేడిగా ఏదో కొత్త పదార్థం తయారైంది. దాన్నే పాలకోవా అంటారని చెప్పాడు.
టేస్ట్ చూశాను...వావ్...సూపర్...పాలకోవా అద్దిరిపోయింది సార్...
వాళ్ళేదో కలుపుతారు సార్...నాకూ తెలీదు. నిన్ననే ఫ్రెండ్ ఇలా చేస్తారని చెబితే...మీ ఇంట్లో ట్రై చేశా...
తయారైంది కొంచమే అయినా ఫస్ట్ అటెంప్ట్ లోనే టేస్ట్ అద్దిరిపోయింది సార్... మరోసారి మెచ్చుకున్నాను.
-------------------------------------------------------
తర్వాతి రోజు ఉదయం. పాలకోవా తిన్న పరధ్యానంలో...
అప్పుడే తెచ్చిన పాల ప్యాకెట్‌ను కట్ చేసి పొయ్యి మీద పెట్టి సెల్లుఫోనులో సొల్లేస్కోవడానికి బయటికెళ్ళాను.
ఎంతసేపు మాట్లాడానో సరిగ్గా గుర్తులేదు. తిరిగొచ్చి చూసేసరికి అప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్న ఫ్రెండ్ ఎప్పుడు లేచాడో ఫేస్‌లో అయోమయం ఎక్స్ప్రెషన్ పెట్టాడు.
ఏమైంది సార్... అలా ఉన్నారు. ఉలిక్కిపడి నిద్రలేచినట్టున్నారు..
పాలగిన్నె సార్...మీరు పొయ్యి మీద పెట్టి ఎటో వెళ్ళారు. ఏదో మాడుతున్న వాసనొచ్చి సడెన్‌గా నిద్రలేచి చూస్తే...ఇదిగో ఇదీ పరిస్థితి...అంటూ పొయ్యి వైపు చూపించాడు. పొయ్యి ఆపేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే కాసేపట్లో గిన్నె కూడా కరిగిపొయ్యేది.
ఊప్స్...మర్చేపోయా అనుకుంటూ అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుందని తెలుగు చానల్ రిపోర్టర్ లాగా పరిగెత్తాను.
చూస్తే ఇదిగో ఇలా ఉంది పరిస్థితి.

ఇంక దాన్ని తోమడం మన వల్ల కాదు సార్...పడేద్దాం అన్నాను.
ఉండండి సార్...ట్రై చేద్దాం అని మూడు రోజులు శతవిధాలా ప్రయత్నించాడు పాపం. ఊహూ...తోమి తోమి స్క్రబ్బర్ అరిగింది కానీ గిన్నె కరగలేదు.

గిన్నెలో లీటర్ పాలు అలానే ఉన్నాయి. తాగే ఓపిక లేదు. నెక్ట్స్ డే పారబోసేవాణ్ణే.
సరిగ్గా అదే సమయంలో ఫ్రెండ్ వచ్చాడు. రాక రాక ఫ్రెండ్ వస్తే మర్యాద చెయ్యకుండా ఎలా ఉంటాం.
రండి సార్...చాలా రోజుల తర్వాత మా ఇంటికొస్తున్నారు. ఏంటీ సంగతులు
పనుండి పక్కింటికొచ్చాను సార్...పన్లో పనిగా మీ ఇళ్ళు కూడా చూసిపోదామని వచ్చాను.
అలాగా అయితే కాఫీ, టీ, బూస్ట్, రాగిమాల్ట్ etc... ఏదైనా తాగుతారా...
ఈ టైమ్‌లో పాలెక్కడివి సార్ మీకు.
ప్రొద్దున్నించీ చెడిపోకుండా కాచడమే కానీ, తాగ లేదు సార్. అందుకే ఆ లీటర్ పాలు అలాగే ఉన్నాయి.
అవునా...అయితే ఓ పని చేద్దాం సార్...
ఏం చేద్దాం సార్...
ఎలాగూ చాలా పాలున్నాయి కదా...వేస్ట్ కాకుండా పాలకోవా చేద్దాం సార్..
నా దగ్గర పాలూ, పంచదార తప్ప పాలకోవా చెయ్యడానికి మరో వస్తువు లేదు సార్...
పాలకోవా కూడా పాలూ, పంచదారతోనే చేస్తారు సార్...వేరే ఏదీ అఖ్ఖర్లేదు.
అవునా...నాకు తెలీదు... (ఎట్టా చేస్తారబ్బా...బుర్రగోక్కున్నా కాసేపు)

సరే మీరు చెయ్యండి. నేను చూస్తాను...
ఫ్రెండ్ పాలకోవా చెయ్యడం స్టార్ట్ చేశాడు. అరలీటర్ పాలు తీసుకొని వేడి చెయ్యడం స్టార్ట్ చేశాడు. ఒకపక్క పాలు వేడెక్కుతూ ఆవిరైపోతున్నాయ్...మరోపక్క పట్టువదలని విక్రమార్కుడిలా గరిట తిప్పుతూనే ఉన్నాడు. కాసేపటికి అరలీటర్లో సగానికి సగం ఆవిరైపోయాయి.
ఏం చేస్తున్నారు సార్.... పాలన్నీ ఆవిరైపోతున్నాయ్...కాసేపైతే అక్కడేమీ మిగిలేట్లు లేవు.
ఉండండి సార్...చూస్తూ ఉండండి. నేను చేసి చూపిస్తానుగా అంటూ ఒక స్పూన్ చక్కరేసి మళ్ళీ తిప్పడం స్టార్ట్ చేశాడు. కాసేపటితర్వాత మరో స్పూన్ చక్కరేశాడు. ఇంకాసేపు గరిటతో తిప్పిన తర్వాత వేడివేడిగా ఏదో కొత్త పదార్థం తయారైంది. దాన్నే పాలకోవా అంటారని చెప్పాడు.
టేస్ట్ చూశాను...వావ్...సూపర్...పాలకోవా అద్దిరిపోయింది సార్...
కానీ, ఈ కాస్త పాలకోవా చెయ్యడానికి అరలీటర్ పాలు బొక్కడ్డాయి కదా సార్...బయట బండ్లమీద అంత చీపుగా ఎట్టా అమ్ముతారు మరి.
వాళ్ళేదో కలుపుతారు సార్...నాకూ తెలీదు. నిన్ననే ఫ్రెండ్ ఇలా చేస్తారని చెబితే...మీ ఇంట్లో ట్రై చేశా...
తయారైంది కొంచమే అయినా ఫస్ట్ అటెంప్ట్ లోనే టేస్ట్ అద్దిరిపోయింది సార్... మరోసారి మెచ్చుకున్నాను.
-------------------------------------------------------
తర్వాతి రోజు ఉదయం. పాలకోవా తిన్న పరధ్యానంలో...

అప్పుడే తెచ్చిన పాల ప్యాకెట్‌ను కట్ చేసి పొయ్యి మీద పెట్టి సెల్లుఫోనులో సొల్లేస్కోవడానికి బయటికెళ్ళాను.
ఎంతసేపు మాట్లాడానో సరిగ్గా గుర్తులేదు. తిరిగొచ్చి చూసేసరికి అప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్న ఫ్రెండ్ ఎప్పుడు లేచాడో ఫేస్‌లో అయోమయం ఎక్స్ప్రెషన్ పెట్టాడు. ఏమైంది సార్... అలా ఉన్నారు. ఉలిక్కిపడి నిద్రలేచినట్టున్నారు..
పాలగిన్నె సార్...మీరు పొయ్యి మీద పెట్టి ఎటో వెళ్ళారు. ఏదో మాడుతున్న వాసనొచ్చి సడెన్‌గా నిద్రలేచి చూస్తే...ఇదిగో ఇదీ పరిస్థితి...అంటూ పొయ్యి వైపు చూపించాడు. పొయ్యి ఆపేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే కాసేపట్లో గిన్నె కూడా కరిగిపొయ్యేది.
ఊప్స్...మర్చేపోయా అనుకుంటూ అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుందని తెలుగు చానల్ రిపోర్టర్ లాగా పరిగెత్తాను.
చూస్తే ఇదిగో ఇలా ఉంది పరిస్థితి.

ఇంక దాన్ని తోమడం మన వల్ల కాదు సార్...పడేద్దాం అన్నాను.
ఉండండి సార్...ట్రై చేద్దాం అని మూడు రోజులు శతవిధాలా ప్రయత్నించాడు పాపం. ఊహూ...తోమి తోమి స్క్రబ్బర్ అరిగింది కానీ గిన్నె కరగలేదు.

రామ లింగా...!!
ReplyDeleteకేవ్వ్వ్వవ్....:)))))))))))))))
kekundi sr........
ReplyDeleteకేకో కేక
ReplyDeletehttp://www.youtube.com/watch?v=quecXFbMvvg
చాలెంజ్ :))
శతమర్కటం..పిసలాటకం..బ్రంహచారులా బ్రతుకే [వరం కాదు]..ఘోరం..
ReplyDeleteసుందరాకాండకు సందడే..సందడి..అంటే ఇదే నా[త్యా]గయ్యా
ReplyDelete