ఒకానొకప్పుడు తిరుమలకు ఎవరైనా వెళ్ళొస్తే "తిరుమలకు వెళ్ళొచ్చావా!" అని ఆశ్చర్యంగా అదో అచీవ్మెంట్ లాగా అడిగేవారు. వెళ్ళొచ్చినవాళ్లు కూడా వాళ్ళ సందులోవాళ్ళని నలుగురినీ పిలిచి భోజనాలు పెట్టి తిరుమల ప్రసాదం లడ్డూని పంచి పెట్టేవారు. ప్రసాదంతో పాటు చేతికో, మెడకో కట్టుకోవడానికి నల్ల దారం కూడా ఇవ్వాల్సిందే. నా చిన్నప్పుడు ఇప్పట్లాగా తిరుమలలో ఇన్ని సౌకర్యాలు లేవు. ఇంటిదగ్గర్నుండే వంట సరంజామానంతా తీసుకెళ్ళాలి. రైల్వేస్టేషన్ నుండి అలిపిరి అక్కడనుండి కొండపైకి మొత్తం అంతా నడిచేవెళ్ళేవారు. అదీ ఒట్టిచేతుల్తోకాదు. భుజం మీద యాభై కేజీల బియ్యం బస్తాతో నడిచేవాళ్ళు ఒకరైతే, ఇతరత్రా బ్యాగులు వంట పాత్రలు వగైరా కొద్ది కొద్ది దూరం నడుస్తూ మార్చుకుంటూ కష్టపడి తిరుమల చేరుకునేవారు. ఇప్పుడు చేతిలో వాటర్ బాటిల్ మొయ్యాలన్నా కష్టమే. అప్పట్లో ఇంటికి త్వరగా తిరిగివెళ్ళాలన్న ఆలోచన ఉండేది కాదు. వారం పది రోజులు పైనే ఉండేవారు.
ఇప్పుడు భక్తుల కోసం తిరుపతి, తిరుమలలో బోల్డన్ని సౌకర్యాలు. తిరుపతిలో రైల్వేస్టేషన్ దిగితే చాలు మిగతా అంతా దేవుడే చూసుకుంటాడు. గత సంవత్సరం వరకు బస్టాండ్‌కు సమీపంలో ఉన్న "శ్రీనివాసం"లో లాకర్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు కొన్ని నెలల క్రితమే రైల్వేస్టేషన్ ఎదురుగా "విష్ణు నివాసం" కట్టారు. కొత్తగా కట్టారు కాబట్టి, నీట్‌గా, చాలా సౌకర్యవంతంగా ఉంది. ప్రయాణ ఖర్చులని మినహాయిస్తే, మిగతా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పోల్చితే అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే యాత్ర తిరుమల ఒక్కటే. అందుకే చాలామంది ప్రతీ రెణ్ణెళ్ళకో, మూణ్ణెళ్లకో వీలైన ప్రతీసారీ వస్తుంటారు. రెండేళ్ళ క్రితం నేనూ దాదాపు ప్రతీ నెలా వెళ్ళేవాడిని. వెళ్ళిన ప్రతీసారీ నడుచుకుంటూ వెళ్ళడమే.
చెప్పానుగా తిరుపతిలో ట్రైన్ దిగితే చాలు మిగతా అంతా దేవుడే చూసుకుంటాడని. ప్రతీ పది, పదిహేను నిమిషాలకు దేవస్థానం బస్సులు రైల్వేస్టేషన్ నుండి అలిపిరికి తిరుగుతుంటాయి. కాబట్టి రైల్వేస్టేషన్ నుండి ఫ్రీగా అలిపిరి చేరుకోవచ్చు. అలిపిరి నుండి నడిచేవారి స్పీడ్‌ని బట్టి మూడు గంటల నుండి ఆరుగంటల టైమ్ పడుతుంది తిరుమల చేరుకోవడానికి. మెట్ల దారిలో ప్రతీ మెట్టుకూ బొట్టు లేదా కర్పూరం వెలిగిస్తూ వెళ్ళేవారుంటారు. వాళ్ళకి ఎంత టైమ్ పడుతుందో. ప్రతీ మెట్టునూ పూజిస్తుంటారు కాబట్టి మెట్ల మీద చెప్పులతో తిరగడం మంచిది కాదు. కానీ, ఈ మధ్య చాలామంది చెప్పులతో వెళ్ళడం చూసి విస్తుబోతుంటాను. అట్లీస్ట్ ఒక కవర్లో పెట్టుకొని చేతిలోనైనా పైకి తీసుకెళ్ళాలి కానీ చెప్పులతో మెట్లను తాకకూడదు.
విష్ణు నివాసంలోనే కౌంటర్ దగ్గర ఇస్తే మన బ్యాగుల్ని కొండమీదకు పంపిస్తారు కాబట్టి, కేవలం మనకు అవసరమైన వాటర్ బాటిల్, లైట్‌గా ఇంటిదగ్గర్నుండి తెచ్చుకున్న చపాతీ వగైరా ఫుడ్ సరంజామాతో పైకి నడిచివెళ్ళొచ్చు. నిజానికి ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంటే చాలు. ఎందుకంటే నడిచివెళ్ళే ప్రయాణీకుల సౌకర్యార్థం గాలిగోపురం, అంజనాద్రి దాటి వెళ్ళిన తర్వాత నరసింహ స్వామి గుడి దగ్గరున్న ఒక ఊడలు దిగిన చెట్టు క్రింద భక్తులకు దేవస్థానమే టైమ్‌ను బట్టి టిఫిన్, భోజనం వగైరా ఏర్పాటు చేసింది కాబట్టి.
పైకి చేరుకున్న తర్వాత ఎప్పటిలానే మాధవ నిలయంలో లాకర్ తీసుకున్నాం. ఫ్యామిలీ మొత్తం వెళ్ళినప్పటికీ రూములు తీస్కోవడం నాకు ఇష్టముండదు. లాకర్లో జస్ట్ బ్యాగులు పడేస్తే చాలు, మిగతా అన్ని సౌకర్యాలకు ఏ లోటూ ఉండదు. నిద్రొస్తే ఆ సువిషాలమైన కొండమీద ఎక్కడైనా పడుకోవచ్చు. ఒక దుప్పటి తీస్కొని కోనేరు, ఆ చుట్టు పక్కల ఉన్న తిరుమాడ వీధుల్లో ఎక్కడైనా ఆ దేవుణ్ణి స్మరిస్తూ హాయిగా నిద్రపోవచ్చు.
తర్వాతి రోజు వరాహ స్వామి దర్శనం అయ్యాక ఎనిమిది గంటల ప్రాంతంలో నడిచివచ్చిన వారికోసం ఉన్న ప్రత్యేక క్యూలైన్లో నిలబడ్డాం. ఒక పక్క క్యూ కదులుతున్నా, మరో పక్క క్యూ లైన్లోకే టైమ్‌ను బట్టి పాలు, టిఫిన్, భోజనం సప్లై చేసింది దేవస్థానం. కాబట్టి వీటిని వేటి గురించీ ఆలోచించుకోకుండా దేవుణ్ణి స్మరించడమే మనం విధిగా చెయ్యవలసిన పని. ఇప్పటికాలంలో క్యూలైన్లో కదులుతున్నప్పుడు గోవిందా..గోవింద అని అరవడం నామోషీ అయిపోయింది..ప్చ్.. ఎవరికి వారు మనసులో అనుకోవల్సిందే. మధ్యాహ్నం ఒంటిగంటకు దర్శనం అయిపోయింది. ఆ దివ్యమంగళ స్వరూపుడి గురించి కొత్తగా నేను చెప్పేదేమీ లేదు. ఎన్ని సెకన్ల టైమ్ దొరికితే అంత వ్యవధిలో ఆయన్ని తనివి తీరా చూడ్డమే చేయగలిగింది. ఇంకా బాగా నిధానంగా చూడాలనుకుంటే మాత్రం అమావాస్యరోజెళ్ళాలి. :-)
కొండమీద కొత్తగా కోనేటికి కొద్దిగా దగ్గర్లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎవరో రాజు గారు అన్నదాన సత్రం భక్తుల సౌకర్యార్థం కట్టించారు. స్పేసియస్‌గా చాలా బాగుంది. మునుపటిలాగా పాత సత్రంలో ఇబ్బంది పడనఖ్ఖర్లేదు.
తిరుమలలో ప్రతీ సంవత్సరం ఏదో ఒక మార్పు గానీ లేదా ఏదో ఒక కొత్త సౌకర్యం చేరడం గానీ జరుగుతుంటుంది. అందుకే ఏడాది క్రిందటితో పోలిస్తే, ఇప్పుడు కొత్తగా నా అనుభవంలోకి వచ్చిన కొన్ని మార్పులను, సౌకర్యాల గురించి ఇక్కడ రాశాను.

Nice !
ReplyDeleteగోవిందా...గోవింద!
ReplyDeleteచాలా బాగా వ్రాశారు!
Good !!
ReplyDeleteబాగుంది కాలినడకన వెళ్ళాలనుకుంటున్న వారికి ఉపయోగ పదే విధంగా ఉంది .సిఫారసులు, ఏర్పాట్లు ఎమీ లేకుండా అలా వెళ్లి వస్తేనే సంతృప్తి కరంగా ఉంటుంది
ReplyDeleteసిఫారసులు, ఏర్పాట్ల కోసం వాళ్ళనీ వీళ్ళనీ అడిగి అవి సమకూర్చుకునేలోపు హాయిగా దర్శనం చేసుకొని తిరిగి వచ్చేయచ్చు మురళీ గారు. నడిచి వెళ్ళేవాళ్ళైతే ఖచ్చితంగా ఇరవై నాలుగ్గంటల్లోపు దర్శనం ముగించుకోవాలి లేకపోతే టికెట్ చెల్లదు. క్యూలో మహా అయితే నాలుగైదు గంటలు ఉంటాం. ఆ మాత్రం కూడా వేచి ఉండే ఓపిక లేనివారికి చెప్పేదేమీ లేదు. :-)
Deleteకిందటి పది సంవత్సరాలుగా నేనెప్పుడూ నడిచే కొండెక్కి దర్శనం చేసుకున్నాను కానీ చెప్పులతో మెట్లెక్కకూడదని నాకిన్నాళ్ళూ తెలియదే!
ReplyDeleteక్రిష్ణవేణి
లేదండి చెప్పులతో కొందేక్కకూడదు. అసలు కొండ మీద చెప్పులతో తిరగకూడదు ఎక్కడా. కాని చాల మంది ఎం చేస్తారంటే కొందేక్కేతప్పుడు చెప్పులు తీసేసి మల్లి కొండ పైన వేసుకుంటారు. సరేలెండి ఎవరి నమ్మకాలు వాళ్లవి. కొంతమంది ఏదో జాగింగ్ కి వెళ్లినట్టు మంచి మంచి షూస్ వేసుకుంటారు కాళ్ళ నొప్పులు రాకుండా. నేను కూడా మొదట్లో కొండ పైన వేసుకునే వాణ్ని, కాని ఆ తరువాత మొత్తం పూర్తిగా మానేసాను కొండ ఎక్కినా దగ్గరనుండి దిగే వరకు వేసుకోవడం లేదు.
Delete:venkat
Good good.. నేను కూడా రెండు వారాల క్రితమే దర్శనం చేసుకుని వచ్చాను.
ReplyDeleteమంచి విషయాలు వ్రాసారు.ఇప్పుడు నడ్క్యక చాలా సులువు శ్రీవారి మెట్లు దారిలో
ReplyDeleteఅయితే.ఇంకా దేవ స్తానం వారు నడిచి వచ్చిన వారికి దర్శనం తికట్స్ కూడా ఇస్తారు
కొండమీద జోళ్ళు వేసుకోలేదు ఎప్పుడూ. మెట్ల మీద వేసుకోకూడదని ఇప్పుడే తెలిసింది మరి.
ReplyDeleteచెప్పులే వేసుకోని భక్తచింతామణులు, మలమూత్రాదులు విసర్జిస్తారా?! వూహూ... అట్టి దారుణ పాపానికి ఒడ గట్టరనే నేననుకోను, అన్నీ బంద్ చేసుకుంటారు. :P :)
ReplyDeleteఎక్కడ బంద్ చేసుకోవాలో అక్కడ చేసుకొని, ఎక్కడ విసర్జించాలో అక్కడ విసర్జిస్తాం శంకర్ గారు. :-)
Delete