మధ్నాహ్నం ఒకటిన్నర. ఏమి చెయ్యాలి. ఈ ఎండలో పడి బస్సులో ప్రయాణమా లేదా హాయిగా సినిమా చూసి సాయంత్రం చల్లగాలిలో ప్రయాణమా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఏదో ఒక సినిమానే చూసి పోదాం అని దగ్గర్లో ఉన్న థియేటర్ వైపు అడుగులేశాను. అధినాయకుడు, దరువు రెండు సినిమాలాడ్తున్నాయి అక్కడ. రివ్యూల్లో రెండూ రాడ్డు సినిమాలే అని చదివాను. మరి రెండు రాడ్డు సినిమాల్లోనూ ఏ రాడ్డైతే బెటర్ అని కాసేపు ఆలోచించి చివరికి "రెండు సినిమాల్లోనూ ఏ సినిమాకైతే ఎక్కువమంది జనాలెల్తారో దానికెళ్దాం" అని ఫిక్సై పోయి రెండు కౌంటర్లకేసి గమనిస్తూ అలా సైడ్‌కు నిలబడ్డా.
దరువు సినిమా టికెట్ కౌంటర్ రెండు బారల పొడవుంది. అధినాయకుడు దగ్గర అరడజను మంది కూడా లేరు. మరి కాసేపు చూద్దాం అని ఆగా. కాసేపటికి దరువు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్ని కౌంటర్లు కూడా డబుల్ అయ్యాయి. అధినాయకుడు దగ్గర ఉన్న అరడజన్లో హాఫ్ డజన్ కనిపించడం లేదు. ఇలానే ఉంటే మొదటికే మోసం
వస్తుందని గ్రహించి నా నిర్ణయానికి కట్టుబడి దరువు సినిమాకు క్యూలో నిలబడ్డా. కాసేపటికి నా వెనకమాల లైన్ మళ్ళీ రెండు బారలయ్యింది. అధినాయకుడు మాత్రం పెరగలేదు తగ్గలేదు పాపం.
దరువు కౌంటర్ ముందర చూస్తే మహా అయితే ముప్పై మంది ఉంటారేమో, వెనకాల మంచి సీటే వస్తుందని ఆశపడ్డా. ప్చ్... తరువాత తెలిసింది ముందున్న ఒక్కొక్కరు ఐదు నుంచి పది టికెట్లు తీసుకుంటున్నారని. నా వంతు వచ్చేటప్పటికి ఇద్దరు తగిలారు. అన్నా నాకొకటి, నాకో ఐదు అని మొత్తం ఆరు టికెట్లు. ఇంతవరకు క్యూలో నిలబడింది మీకోసమేనా దొబ్బెయ్ బే అని ఐదు టికెట్లోన్ని వదిలేసి, ఒక్క టికెట్ వాడికి ఒక్కటి తీసి ఇచ్చా ఎందుకైనా మంచిదని. భయపడినట్టుగానే నా సీట్ H వరసలో మూలనొచ్చింది. హుమ్మ్...
లోపలి కెళ్ళి కాసేపు కూర్చున్నాక చూస్తే హాల్ మొత్తం నిండిపోయింది. ఇదేంటండీ ఈ సిన్మా చూస్తేనేమో రాడ్ అంటున్నారు, పైగా వచ్చి రెండు వారాలయ్యింది, ఇవ్వాళేమో శనివారమో, ఆదివారమో, కనీసం సెలవు దినం కూడా కాదు. సోమవారం నాడు అదీ ఈ సినిమాకు ఫుల్ అవడమేంటండీ అని ఆశ్చర్యంగా నేను టికెట్ తీసిచ్చినోడిని అడిగా...
ఈ సిన్మాకు ఇది నేను రెండోసారి అన్నా రావడం... వాడి జవాబు.
సినిమా అంత బాగుందా...
కామెడీ బాగుందన్నా...
ఏదీ నిజం చెప్పు.
అంటే బయట ఎండ, ఉండలేక ఇక్కడైతే ఏసీ ఉంటుందని వచ్చా...
ఇదీ అబద్ధం. ఏదీ ఈ సారి నిజం చెప్పు చూద్దాం.
ఇప్పుడు కరెంట్ పోతుందన్నా. అటు పనిలేక, ఇటు ఉక్కపోతకి చావాలి. బయట రోడ్లెమ్మట తిరిగే బదులు ఇదైతే బెటర్ అని వచ్చా.
హుమ్మ్...అద్దీ మ్యాటర్. ఈ సిన్మా ఎందుకు హౌస్‌ఫుల్ అయ్యిందో అప్పుడర్థమైంది నాకు. అలా మాటల్లో ఉండగా సిన్మా మొదలు కాబోతుందనగా కరెంట్ పోయింది. థియేటర్ వాడు జెనరేటర్ ఆన్ చేశాడు. ప్చ్... ఏసీ తీసివేశాడు. డొక్కు ఫ్యాన్లేశాడు ఉక్కపోతకు చావండని.
సిన్మా మొదలైంది.
స్క్రీన్ మీద అక్షరాలతో తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. నిర్మాతలు అన్నచోట చూస్తే అందరూ కూడా యమగోల, యముడికి మొగుడు, యమలీల సినిమాల నిర్మాతలు అని బ్రాకెట్లో రాశాడు.
యముడు వాళ్ళకు బాగా అచ్చొచ్చినట్టున్నాడు పాపం.
తర్వాత, శవాల దగ్గర వాయించే డప్పుల సంగీతం బ్యాగ్రౌండ్లో వినిపిస్తుండగా "ద..రు..వు" అని ఒక్కో అక్షరం టైటిల్లాగా స్క్రీన్ మీద పడింది.
యమలోకం. యమపురి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యమలోకం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ అవుతున్నది. ఎప్పుడో పెద్దాయన ఎన్టీయార్ యమగోల సినిమాలో నటించి యమలోకంలో గోల గోల చేశారు. కాకపోతే యముడి మీద హాస్యం ఏమిటనో, గౌరవం తగ్గకూడదనో లేదా విమర్శలు రాకూడదన్న కారణం చేతనో ఆ సినిమాలోని నరకలోక సన్నివేశాలను ఆయన కలకంటున్నట్టుగా చిత్రీకరించారంట. ఎందుకంటే కలలకు లాజిక్కులు, రీజనింగులు ఉండనవసరం లేదు కాబట్టి. తర్వాత కొన్నేళ్లకు చిరంజీవి నటించిన "యముడికి మొగుడు" సిన్మా నుంచే యముడి మీద వెకిలి హాస్యం చిత్రీకరించడం స్టార్ట్ అయ్యింది. అప్పట్నుంచి ఇప్పటి దరువు సిన్మా వరకు వివిధ రూపాలను సంతరించుకుంటూ అది సాగుతూనే ఉంది. మిగతా దేవుళ్ల మీద తీస్తే సిన్మా హిట్టవుద్దో ఫట్టవుద్దో తెలీదు కానీ యముని మీద తీసినవి మాత్రం హిట్టే అయ్యాయి. ఆ మధ్య వచ్చిన "స్వర్గలోకం టు నరకలోకం వయా భూలోకం" పోద్దేమోననుకున్నాను కానీ ఆ సిన్మా నిర్మాతలు తమకు మంచి లాభాలొచ్చాయని చెప్పడంతో యమునికి తిరుగులేదని ఫిక్సైపోయాను.
దరువు కూడా పైన చెప్పుకున్న సినిమాల్లాంటి సినిమానే. భూలోకంలోని ఒక తెలుగు వాడు యముణ్ణి ముప్పు తిప్పలు పెట్టాలి, దాన్ని అడ్డం పెట్టుకొని హీరో లోకకళ్యాణానికి పాటు పడాలి. అదీ పాయింట్. సరే సినిమా విషయానికొద్దాం.
యమలోకంలో కాసేపు యముడు, చిత్రగుప్తుడు తదితర పాత్రల మధ్య వెకిలి హాస్యం అయిపోయాక చిత్రగుప్తుడు యముడి పీఠం క్రింద మంట పెట్టాలనుకోవడంతో కథ భూలోకంలోకి వస్తుంది. వెంటనే సచిన్ సెంచరీల రికార్డును సమం చేస్తూ చెన్నైలో జైల్లో నుంచి బయటికొస్తాడు బుల్లెట్ రాజా... మరి కాసేపటికే శవాల దగ్గర వేసే డ్యాన్సులతో,
డప్పులతో, మెరీనా బీచ్ తీరంలో చెన్నై చేపల బ్యాచ్‌తో తమిళ ఘాటుతో కూడిన మాస్ మహారాజా మాస్ సాంగ్. ఇంకాస్సేపటికి తిక్కల్ది అయిన హీరోయిన్‌తో లవ్. ఈ సిన్మాలో హీరోయిన్ నిజంగా తింగరి, తిక్కదాన్లాగే ఉంటుంది మరి. చలాకీతనం ఉండదు, షాక్ అయితే నోరు తెర్చుకొని చూస్తూ నోట్లోకి ఈగలు పోయినా పట్టించుకోదు. హీరోతో సులభంగా లవ్‌లో పడిపోద్ది, వాడి వెంట పరిగెడుతుంది. ఫైటింగ్‍లో కూడా దాంతో రొమాన్స్ చేస్తూ హీరో ఛస్తాడు. యథావిధిగా మనోడు యమలోకానికి వెళ్ళి, భూలోకానికి తిరిగొస్తాడు. కాకపోతే వీడి బాడి కాలిపోద్ది కాబట్టి వాడిలాగే ఉన్న ఇంకోడి బాడిలోకి పరకాయ ప్రవేశం చేసి వస్తాడు.
ఆ తర్వాత యథావిధిగా తమిళ సినిమాల్లోలాగా రవితేజ చేసే ఓవరాక్షన్, వెకిలి చేష్టలూ భరిస్తే సినిమా క్లైమాక్స్‌కు చేరి బుర్ర మీద దరువేసుకుంటూ మనం లేచెళ్ళిపోతాం.
ఇంక చివరిగా సినిమా నచ్చిందా అంటే నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే తెలుగు సినిమా కాబట్టి. వాళ్ళు తియ్యడానికి మనం చూడ్డానికీ అలవాటు పడ్డాం కాబట్టి.

దరువు సినిమా టికెట్ కౌంటర్ రెండు బారల పొడవుంది. అధినాయకుడు దగ్గర అరడజను మంది కూడా లేరు. మరి కాసేపు చూద్దాం అని ఆగా. కాసేపటికి దరువు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్ని కౌంటర్లు కూడా డబుల్ అయ్యాయి. అధినాయకుడు దగ్గర ఉన్న అరడజన్లో హాఫ్ డజన్ కనిపించడం లేదు. ఇలానే ఉంటే మొదటికే మోసం
వస్తుందని గ్రహించి నా నిర్ణయానికి కట్టుబడి దరువు సినిమాకు క్యూలో నిలబడ్డా. కాసేపటికి నా వెనకమాల లైన్ మళ్ళీ రెండు బారలయ్యింది. అధినాయకుడు మాత్రం పెరగలేదు తగ్గలేదు పాపం. దరువు కౌంటర్ ముందర చూస్తే మహా అయితే ముప్పై మంది ఉంటారేమో, వెనకాల మంచి సీటే వస్తుందని ఆశపడ్డా. ప్చ్... తరువాత తెలిసింది ముందున్న ఒక్కొక్కరు ఐదు నుంచి పది టికెట్లు తీసుకుంటున్నారని. నా వంతు వచ్చేటప్పటికి ఇద్దరు తగిలారు. అన్నా నాకొకటి, నాకో ఐదు అని మొత్తం ఆరు టికెట్లు. ఇంతవరకు క్యూలో నిలబడింది మీకోసమేనా దొబ్బెయ్ బే అని ఐదు టికెట్లోన్ని వదిలేసి, ఒక్క టికెట్ వాడికి ఒక్కటి తీసి ఇచ్చా ఎందుకైనా మంచిదని. భయపడినట్టుగానే నా సీట్ H వరసలో మూలనొచ్చింది. హుమ్మ్...
లోపలి కెళ్ళి కాసేపు కూర్చున్నాక చూస్తే హాల్ మొత్తం నిండిపోయింది. ఇదేంటండీ ఈ సిన్మా చూస్తేనేమో రాడ్ అంటున్నారు, పైగా వచ్చి రెండు వారాలయ్యింది, ఇవ్వాళేమో శనివారమో, ఆదివారమో, కనీసం సెలవు దినం కూడా కాదు. సోమవారం నాడు అదీ ఈ సినిమాకు ఫుల్ అవడమేంటండీ అని ఆశ్చర్యంగా నేను టికెట్ తీసిచ్చినోడిని అడిగా...
ఈ సిన్మాకు ఇది నేను రెండోసారి అన్నా రావడం... వాడి జవాబు.
సినిమా అంత బాగుందా...
కామెడీ బాగుందన్నా...
ఏదీ నిజం చెప్పు.
అంటే బయట ఎండ, ఉండలేక ఇక్కడైతే ఏసీ ఉంటుందని వచ్చా...
ఇదీ అబద్ధం. ఏదీ ఈ సారి నిజం చెప్పు చూద్దాం.
ఇప్పుడు కరెంట్ పోతుందన్నా. అటు పనిలేక, ఇటు ఉక్కపోతకి చావాలి. బయట రోడ్లెమ్మట తిరిగే బదులు ఇదైతే బెటర్ అని వచ్చా.

హుమ్మ్...అద్దీ మ్యాటర్. ఈ సిన్మా ఎందుకు హౌస్‌ఫుల్ అయ్యిందో అప్పుడర్థమైంది నాకు. అలా మాటల్లో ఉండగా సిన్మా మొదలు కాబోతుందనగా కరెంట్ పోయింది. థియేటర్ వాడు జెనరేటర్ ఆన్ చేశాడు. ప్చ్... ఏసీ తీసివేశాడు. డొక్కు ఫ్యాన్లేశాడు ఉక్కపోతకు చావండని.
సిన్మా మొదలైంది.
స్క్రీన్ మీద అక్షరాలతో తమ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. నిర్మాతలు అన్నచోట చూస్తే అందరూ కూడా యమగోల, యముడికి మొగుడు, యమలీల సినిమాల నిర్మాతలు అని బ్రాకెట్లో రాశాడు.
యముడు వాళ్ళకు బాగా అచ్చొచ్చినట్టున్నాడు పాపం.తర్వాత, శవాల దగ్గర వాయించే డప్పుల సంగీతం బ్యాగ్రౌండ్లో వినిపిస్తుండగా "ద..రు..వు" అని ఒక్కో అక్షరం టైటిల్లాగా స్క్రీన్ మీద పడింది.
యమలోకం. యమపురి. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యమలోకం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా అప్డేట్ అవుతున్నది. ఎప్పుడో పెద్దాయన ఎన్టీయార్ యమగోల సినిమాలో నటించి యమలోకంలో గోల గోల చేశారు. కాకపోతే యముడి మీద హాస్యం ఏమిటనో, గౌరవం తగ్గకూడదనో లేదా విమర్శలు రాకూడదన్న కారణం చేతనో ఆ సినిమాలోని నరకలోక సన్నివేశాలను ఆయన కలకంటున్నట్టుగా చిత్రీకరించారంట. ఎందుకంటే కలలకు లాజిక్కులు, రీజనింగులు ఉండనవసరం లేదు కాబట్టి. తర్వాత కొన్నేళ్లకు చిరంజీవి నటించిన "యముడికి మొగుడు" సిన్మా నుంచే యముడి మీద వెకిలి హాస్యం చిత్రీకరించడం స్టార్ట్ అయ్యింది. అప్పట్నుంచి ఇప్పటి దరువు సిన్మా వరకు వివిధ రూపాలను సంతరించుకుంటూ అది సాగుతూనే ఉంది. మిగతా దేవుళ్ల మీద తీస్తే సిన్మా హిట్టవుద్దో ఫట్టవుద్దో తెలీదు కానీ యముని మీద తీసినవి మాత్రం హిట్టే అయ్యాయి. ఆ మధ్య వచ్చిన "స్వర్గలోకం టు నరకలోకం వయా భూలోకం" పోద్దేమోననుకున్నాను కానీ ఆ సిన్మా నిర్మాతలు తమకు మంచి లాభాలొచ్చాయని చెప్పడంతో యమునికి తిరుగులేదని ఫిక్సైపోయాను.
దరువు కూడా పైన చెప్పుకున్న సినిమాల్లాంటి సినిమానే. భూలోకంలోని ఒక తెలుగు వాడు యముణ్ణి ముప్పు తిప్పలు పెట్టాలి, దాన్ని అడ్డం పెట్టుకొని హీరో లోకకళ్యాణానికి పాటు పడాలి. అదీ పాయింట్. సరే సినిమా విషయానికొద్దాం.
యమలోకంలో కాసేపు యముడు, చిత్రగుప్తుడు తదితర పాత్రల మధ్య వెకిలి హాస్యం అయిపోయాక చిత్రగుప్తుడు యముడి పీఠం క్రింద మంట పెట్టాలనుకోవడంతో కథ భూలోకంలోకి వస్తుంది. వెంటనే సచిన్ సెంచరీల రికార్డును సమం చేస్తూ చెన్నైలో జైల్లో నుంచి బయటికొస్తాడు బుల్లెట్ రాజా... మరి కాసేపటికే శవాల దగ్గర వేసే డ్యాన్సులతో,

డప్పులతో, మెరీనా బీచ్ తీరంలో చెన్నై చేపల బ్యాచ్‌తో తమిళ ఘాటుతో కూడిన మాస్ మహారాజా మాస్ సాంగ్. ఇంకాస్సేపటికి తిక్కల్ది అయిన హీరోయిన్‌తో లవ్. ఈ సిన్మాలో హీరోయిన్ నిజంగా తింగరి, తిక్కదాన్లాగే ఉంటుంది మరి. చలాకీతనం ఉండదు, షాక్ అయితే నోరు తెర్చుకొని చూస్తూ నోట్లోకి ఈగలు పోయినా పట్టించుకోదు. హీరోతో సులభంగా లవ్‌లో పడిపోద్ది, వాడి వెంట పరిగెడుతుంది. ఫైటింగ్‍లో కూడా దాంతో రొమాన్స్ చేస్తూ హీరో ఛస్తాడు. యథావిధిగా మనోడు యమలోకానికి వెళ్ళి, భూలోకానికి తిరిగొస్తాడు. కాకపోతే వీడి బాడి కాలిపోద్ది కాబట్టి వాడిలాగే ఉన్న ఇంకోడి బాడిలోకి పరకాయ ప్రవేశం చేసి వస్తాడు. ఆ తర్వాత యథావిధిగా తమిళ సినిమాల్లోలాగా రవితేజ చేసే ఓవరాక్షన్, వెకిలి చేష్టలూ భరిస్తే సినిమా క్లైమాక్స్‌కు చేరి బుర్ర మీద దరువేసుకుంటూ మనం లేచెళ్ళిపోతాం.
ఇంక చివరిగా సినిమా నచ్చిందా అంటే నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే తెలుగు సినిమా కాబట్టి. వాళ్ళు తియ్యడానికి మనం చూడ్డానికీ అలవాటు పడ్డాం కాబట్టి.

ఎందుకు నచ్చింది అంటే...సినిమా హాల్ లో జేనేరేతర్ వేస్తారు కాబట్టి....))
ReplyDeleteకికికి.. గిఫ్ లు కేకా.. .;) ;)
ReplyDeleteraviteja is losing his charm with monotonous roles day by day.
ReplyDeleteహహహహ జిఫ్ లు సూపర్ :) ఏసీ కోసం వెళ్ళి అది కూడా లేకుండా అడ్డంగా దొరికిపోయారనమాట :)
ReplyDeleteజిఫ్ లు సూపర్ :)))
ReplyDelete