Sunday, 6 May 2012

ప్చ్... జీవితం..


చాలా కాలం తర్వాత జీవితం కాస్త ప్రశాంతంగా ఉండటంతో అంతకన్నా ప్రశాంతంగా నిద్రపోతున్నా...

ఒంగోల్ శీను నుంచి ఫోన్....

కళ్ళు కూడా తెరవకుండా అట్టాగే ఫోన్ లిఫ్ట్ చేసి, రాస్బెర్రీ రామలింగడు స్పీకింగ్ అన్నా...

ఏం చేస్తున్నావ్... ఇంకా నిద్రపోతున్నావా?

లేదు, నిద్రపోతూ మాట్లాడుతున్నాను.

నేను నిద్రలో ఉండగా ఆయన ఏదో చెప్పేసి ఫోన్ పెట్టాశాడు...

కాసేపటి తర్వాత రెహ్మాన్ నుంచి ఫోన్..

ఈయనకు కూడా నిద్రలోనే ఏదో మాట్లాడేసి మళ్ళీ నిద్రపోయా...

ఇక మొదలు నా సామిరంగా...కంటిన్యూస్‌గా ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. ఛీ! దీనెమ్మ జీవితం ప్రశాంతంగా నిద్రపోనిచ్చేట్లు లేరని మొహం కడుక్కొని తినడానికి ఏమీ లేదని తెలిశాక అట్టా ఆఫీస్‌కు పోయొచ్చాను. కంటిన్యూస్‌గా ఎవరు ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఏదో ఒక పని మీద.

లాభం లేదనుకొని, మధ్యాహ్నం కాస్త హెవీగా తినేసి సిగ్నల్ అందుబాటులో లేని చోట ఫోన్ పెట్టేసి పడుకున్నా....(ఆఫ్ చెయ్యొచ్చు కదా అని మీరనొచ్చు. అంత బుర్ర నాకు లేదు అందుకే అలా పెట్టేశాను)

సాయంత్రం ఆరుదాకా ఎటువంటి డిస్ట్రబ్ లేకుండా నిద్రపోయా...

సిగ్నల్ ఎలా క్యాచ్ చేసిందో కానీ ఒక ప్రొఫ్ నుంచి ఫోన్...

అలానే నిద్రమొహంలో ఎత్తా...

హలో...నేను ఫలానా ఫ్రొఫ్‌ని...

నిద్రలోనే లిఫ్ట్ చేసి...గుడ్ మార్నింగ్ సార్..అన్నా.. (అప్పుడు టైమ్ సాయంత్రం 6:10 PM)

బాగా బిజీగా ఉన్నట్టున్నారు. మళ్ళీ చేయమంటారా...

ఫర్వాలేదు సార్...కంటిన్యూ చేయండి అని నిద్రలోంచి లేచి కళ్ళు నులుముకుంటూ బయటికెళ్ళాను.

అలా బయటికెళ్ళి మాట్లాడుతుండగా ఎప్పట్నుంచి నా సిగ్నల్ కోసం కాసుకొని కూచున్నాయో, వరుసగా ఇంకో రెండు కాల్స్ వచ్చాయి.

ఆయనతో మాట్లాడి ఫోన్ పెట్టేశాక చూస్తే, పాపం, మా రూమ్మేట్‌ది కూడా ప్రొద్దున్నించీ అదే పరిస్థితి అంట. గ్యాప్ లేకుండా కాల్స్ అటెండ్ చెయ్యాల్సొచ్చిందట.

సరే, సాయంత్రం అయ్యింది. ఏం చేద్దాం సార్...

చాలా రోజుల తర్వాత కాస్త ఫ్రీ అయ్యాం కదా, సిన్మా కెళ్దామా సార్...

ఎప్పుడూ లేనిది ఇవ్వాళ జీవితమేంటి ఇంత ప్రశాంతంగా ఉంది సార్...

నాక్కూడా అలానే ఉంది సార్...

కొంపదీసి ఏ తుఫాన్/సునామి హెచ్చరికో కాదు కదా...

ఏమో ఎవరికి తెలుసు సార్... అదేదో *దమ్ము* సిన్మాకెళ్ళి తేల్చుకుందాం పదండి అని బయలుదేరదీశాను.

ఆ అడవిలో అడవి పందులు తిరిగే సమయం అని తెలిసీ కూడా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్‌కు సెకండ్ షోకెళ్ళాం.

అదో డొక్కు థియేటర్... ఏ కాలంలో కట్టారో... అఫ్‌కోర్స్, ఆ ఊళ్ళో అన్నీ అంతే ఉంటాయనుకోండి. మాకు వేరే గత్యంతరం లేదు. మళ్ళీ ఆ ఊళ్ళో ఏ సినిమా రిలీజ్ అయినా వారం రోజులకు మించి ఆడదు. టికెట్ ధరలు కూడా హైదరాబాద్‌లో కన్నా చాలా కాస్ట్లీ.


చూడక చూడక చాలా రోజుల తర్వాత సిన్మా చూశామేమో రొటీన్ సిన్మా అయినప్పటికీ పెద్దగా బోర్ కొట్టలేదు మాకు. ఏదో కాస్త టైమ్ పాస్ అయ్యింది. సెకండాఫ్‍లో ఒక పెద్ద ఫైట్ మాత్రం కాస్త అసహనానికి గురి చేసింది అంతే.

మొత్తానికి సిన్మాలో జూ ఎన్టీఆర్‍లో నాయకుడు ఉన్నాడు అని ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం జరిగింది అన్నమాట. లాస్ట్‌లో ఆ డైలాగులున్నందుకేనేమో ఈ సిన్మా మీద బాలయ్య అభిమానులు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఉంటారు. అసలు ఆ డైలాగులు చెప్పడం  కోసమే మిగతా సిన్మా కథ మొత్తం అల్లినట్లనిపించింది లాస్ట్‌లో.

నాకు బోయపాటి శీను మీద ఒక డౌట్ ఉంది. ఎంత ప్రయత్నించినా వాళ్ళ వంశంలో ఆయన తర్వాత మగపిల్లలు పుట్టలేదేమోనని డౌట్. అందుకేనేమో, ఏ సిన్మాలో చూసినా మగపిల్లల్ని లేదా ఊళ్ళో మగాళ్ళని లేకుండా చంపాలని డైలాగులు చెప్పిస్తూ చంపిస్తుంటాడు.


పాతికేళ్ళు ఒక ఊళ్ళో అంటే దాదాపు ఒక తరం మొత్తం మగపిల్లలు లేకుండా చేస్తే ఇంక ఆ ఊరెక్కడుంటిరా పిచ్చ నా డ్యాష్. అప్పటికే ఉన్న ఆడపిల్లలు మొత్తం పెళ్ళిళ్ళు చేసుకొని ఏదో ఊరికి పొయ్యి సెటిల్ అయ్యుంటారు. మహా అయితే ముసలి ముతకా వుంటారు. వాళ్ళు కూడా విలన్ అరాచకాలకు ఎప్పుడో బలయ్యుండాలి.

హుమ్మ్... ఎందుకులే, చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఇక్కడితో ఆపేద్దాం.

తిరిగి వస్తూ... ఈ సిన్మా చూసినా కూడా మనకు బోర్ కొట్టలేదేంటి సార్...అసలు జీవితమేంటి ఇంత ప్రశాంతంగా ఉంది.

ఏమో సార్... ఏ తుఫాన్ హెచ్చరికనో ఎవరికి తెలుసు... ఆ అర్ధరాత్రి హైవే కన్నా హైలెవెల్లో ఉన్న ఆ రోడ్డు మీద జామ్మంటూ నిండు జాబిలిని చూస్తూ దారిలో అడ్డుగా వచ్చే చిన్న చితకా కుందేళ్ళలాంటి జంతువులకు దారినిస్తూ సాగిపోయాం.

3 comments:

  1. ఈ సిన్మా చూసినా కూడా మనకు బోర్ కొట్టలేదేంటి సార్...అసలు జీవితమేంటి ఇంత ప్రశాంతంగా ఉంది

    ReplyDelete