గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ వరకు చూసి వచ్చేశాను. కాబట్టి, సగం సినిమా గురించే ఇక్కడ మాట్లాడుకుందాము.
సినిమా స్టార్ట్ అవ్వడానికన్నా ముందు కొన్ని యాడ్స్ గురించి, హాల్లో జరిగిన ఇతర ముఖ్యమైన సంఘటనల గురించి లైట్‌గా చర్చించుకుందాం.
థియేటర్ బయట జనాలు ఎవ్వరూ లేక థియేటర్ ఓనర్ గాడు జుట్టు పీక్కుంటున్నాడు. 6:30PM కు షో అన్జెప్పి 6:45 PM కు మార్చాడు. తీరా 6:45 PM కు స్టార్ట్ చెయ్యలేదేమంటే, నేను షో స్టార్ట్ చేస్తానన్లేదు ఈ టైమ్‌కు టికెట్లిస్తానన్నాడు.
టికెట్ ఎంత?
70, 100.
ఏంటీ ఏసీ కూడా లేని ఈ డొక్కు డకోటా థియేటర్లో టికెట్ ధర ఇంతనా? ఈ లెక్కన ఈ ప్రపంచంలో టికెట్ ధరలు హైదరాబాదులోనే అత్యంత చీపు. హుమ్మ్, గత్యంతరం లేక వంద టికెట్టొకటి తీస్కొని లోపలికెళ్ళా...
ఒక్కడిని థియేటర్ కెళ్ళడం నాకు చిరాకు. కానీ, వేరే ఆల్టర్నేటివ్ లేక మెల్లగా అటూ ఇటూ చూస్తూ ఫ్యాన్ ఉన్నదగ్గర కూచున్నా...
సినిమా ఎంతకీ స్టార్ట్ చెయ్యట్లేదు. ఏడు దాటి ఏడుంబావు అవుతోంది. ఏం చెయ్యాలో తోచక ఇలా బుక్కయ్యానేటీ అని నాకు ఏడుపొస్తోంది.
వెనకాల నుంచి ఎవడో గట్టిగా హాలంతా వినిపించేలా ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఇంట్రెస్టింగ్ అనిపించి చెవిని అటువైపు ట్యూన్ చేశా. నా మీద కేస్ పెట్టటానికి పోలీస్ స్టేషన్ కెళ్ళావటగా, కానిస్టేబుల్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు, పెట్టుకో పెట్టుకో ఇప్పటికి మూడు సార్లు జైలుకెళ్ళొచ్చా, జైలు నాకు కొత్తేం కాదు. నీయమ్మ! తల్చుకుంటే నిన్ను రేపటికల్లా మర్డర్ చేయించేయగల్ను అంటూ అవతలి వ్యక్తికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈయన ఫోన్ కట్ చేస్తుంటే అవతలి వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. బెదిరించడానికో, బ్రతిమాలడానికో అర్థం కావట్లేదు. కాసేపయ్యాక అర్థమయ్యింది, అవతలి వ్యక్తి ఆడలేడీస్ అని. ఇద్దరిదీ ఏదో ఎఫైర్ వ్యవహారం అనీ, అది బెడిసికొట్టి కేసులదాకా ఎళ్ళిందని. హుమ్మ్...మనకు సంబంధం లేని మ్యాటర్ అని చెవిని థియేటర్ డీటీఎస్ సౌండ్‌కు ట్యూన్ చేశా.
వెంటనే స్టార్ట్ అయ్యింది. సినిమా కాదు. UFO Dts, వినండి, చెవులు దొబ్బిచ్చుకోండి అని ఏదో క్యాప్షన్‌తో స్క్రీన్ మీద ప్రదర్శించబడింది.
సరే, అదైన తర్వాత సినిమా స్టార్ట్ అవుతుందేమోననుకున్నా... ప్చ్.. అప్పటికే లేటైనా కూడా థియేటర్లో జనాలు లేరనే ఏమో కంటిన్యూస్‌గా సమాజానికి ఉపయోగపడే నాలుగు యాడ్స్ వేశాడు. ఇంక ఆలస్యం చేస్తే ఉన్న కాస్త జనాలు కూడా వెళ్ళిపోతారనుకున్నాడో ఏమో సినిమా స్టార్ట్ చేశాడు.
సినిమా పేరు: గబ్బర్ సింగ్... కాదు కాదు "పవన్ కళ్యాణ్స్ గబ్బర్ సింగ్" అట.
ఏకే 47 ని పేలుస్తుండగా టైటిల్ పడుతూ ఉంది.
స్టార్టింగ్... షోలే సినిమాతో... ఎవడో పిల్లగాడు ముప్పై సార్లు షోలే చూస్తున్నాడు. వాడు చూసింది చాలక తమ్ముడికి చూపిస్తున్నాడు. అదేదో స్వంత థియేటరో లేక ఇళ్ళో అయినట్టు వాళ్ళబాబు వచ్చి అక్కడే పిల్లగాణ్ణి తిట్టి లాక్కెళ్ళిపోతాడు. తీరా చూస్తే ఆడు వీడిబాబు కాదు, అన్నా, తమ్ముళ్ళిద్దరికీ ఎవడి బాబు వాడికే సెపరేట్. పెద్దలంటే రెస్పెక్ట్ ఉండదు. ఆ బాబు మన పవన్ బాబుని నాలుగు చీవాట్లేయ్యగానే హీరోలాంటి విలన్ అవతారం ఎత్తేసి పారిపోయి "గబ్బర్ సింగ్" గా ఎదుగుతాడు. మళ్ళీ పక్కూళ్ళోంచి పట్టుకొస్తారు అది వేరే విషయం.
మనోడు ఏం చదువుకున్నాడో తెలీదు కానీ పోలీసాఫీసర్ అయిపోతాడు.
ఇంట్రడక్షన్ సీన్... టంటం టటటం...టాంటాంట టటటాయ్....
కొదమసింహంలో చిరంజీవిలా ఇంట్రడక్షన్. ఆ సినిమాలో అంత క్లాస్‌గా, స్టైల్‌గా ఉండదుకానీ ఏదో ఫర్లే...
అది పల్లెటూరో, టౌనో, తాలూకా స్థాయో, మండల స్థాయో నాకర్థం కాలేదుగానీ అక్కడి వాతావరణం, మనుషులు చూస్తే పల్లెటూరు వాతావరణంలాగా ఉంటుంది. పల్లెటూరులో పోలీస్ స్టేషన్, మళ్ళీ అందులో సీఐ ఏందబ్బా అని డౌటొస్తాది. ఆ డౌట్ ఉండకూడదనే డైరెట్రు ఒక సెంటర్, ఆ సెంటర్లో చుట్టూరా చిన్న చిన్న షాప్స్ పెట్టించాడు. ఆ సెంటర్ ఎందుకురా అంటే, ప్రతీ ఐదు పదినిమిషాల కోసారీ హీరో, విలన్లూ ఫైటింగులు చేసుకోవడానికీ, మిగతా గ్యాప్‌లో హీరో, హీరోయిన్లూ లవ్వాడేసుకోవడానికీ అన్నమాట.. విలన్లను కొట్టిన ప్రతీసారీ టాంటాంట టటటాం అంటూ హోరోను స్లో మోషన్లో నడిపిస్తూ, వెనకాల బ్యాగ్రౌండ్ మ్యూజిక్.
మొత్తానికి అలా ఇంటర్వెల్ దాకా హీరో, విలన్ల కొట్లాట, మధ్యలో కొంచెం కామెడీ, కొంచెం లవ్వు ట్రాక్ తో నడిపించేశాడు.
అదేంటో, హీరో బాబు కాని ఒక బాబుకు రైస్ మిల్ ఉంటుంది. పాపం, ఆ మాత్రం ఆస్తి ఉన్నా కూడా ఇరవైఏళ్ళైనా కూడా అదే డొక్కు ఇళ్ళు ఏ మాత్రం మార్పులేకుండా ఉంటుంది. బహుశా సెంటిమెంట్ సీన్ల కోసమేనేమో... అట్టాగే తల్లి పాత్ర ఎక్కువసేపు అనవసరం అనుకున్నాడేమో ఉన్నట్టుండి సడెన్‌గా చంపేస్తాడు డైరెక్టర్.
ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు, నాగార్జునా తదితర కీచు గొంతున్న హీరోలందరూ ఆవేశంగా బాలకృష్ణలా డైలాగులు చెప్పడం ఆపేస్తే మంచిది. ఎవడి మాడ్యులేషన్లో వాడు చెప్పుకుంటే బెటర్.
ఇక పవన్ కళ్యాణ్ గొంతు, మాటలు అర్థం కావాలంటే ఆయన సినిమాను నాలుగైదు సార్లు చూడాలి. హుమ్మ్..
థియేటరో లేక వేరే ఇంకేదన్నా కారణమో తెలీదు కానీ శృతిహాసన్ నాకు ఈ సిన్మాలో నచ్చలేదు. "అనగనగా ఓ ధీరుడు" లో బాగా నచ్చింది. రాఘవేంద్ర రావు పర్యవేక్షణ అనుకుంటా...అందుకే అందంగా చూపించాడు అందులో...
ఇక సినిమాలో విలన్ ఏంటో, వాడి వాలకమేంటో ఓ పట్టాన అర్థం కాలేదు నాకు. సెకండాఫ్ చూస్తే అర్థమౌతుందేమో.

ఇదంతా ఎందుకుగానీ చివరిగా, ఆ సగం సినిమా నీకు నచ్చిందా అంటే నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే, నేను తెలుగు సినిమా ప్రేక్షకుణ్ణి. ఇట్టాంటి సినిమాలు వాళ్ళు తీయడానికి, నేను చూడ్డానికి అలవాటు పడ్డాం కాబట్టి నచ్చింది.
నచ్చితే సినిమా సగమే ఎందుకు చూశావ్ అనే కదా మీ డౌట్. హుమ్మ్... నాకు అంత టైమే దొరికింది మరి. లేటైతే ఎక్కడ బస్సు మిస్సౌద్దో అని బస్టాండ్‌కు పరిగెత్తి గంటన్నర పైగా కాలుగాలిన పిల్లిలా ఎదురు చూశాక బస్సొచ్చింది. ఏంటయ్యా, 8:45PM కు రావల్సిన బస్సు 10:30 PM కు ఇంత లేట్‌గా వచ్చిందేంటి? ఆన్లైన్లో టైమ్ తప్పు రాశారా అని అడిగితే, ఆన్లైన్ టైమ్ కరెక్టే బాబు, కానీ ఆఫ్లైన్లోబస్సు ఆ టైమ్‌కు రాదు. అసలు 6:45 PM కు Origin లో స్టార్ట్ అవ్వాల్సిన బస్సు స్టార్ట్ అయ్యిందే 8:45 PM కు అని చావు కబురు చల్లగా చెప్పాడు. :-(

no doubt, nee burra dobbindi! its not a fashion to make fun of every telugu movie released in Telugu!
ReplyDeletethey might not get OSCAR's but still telugu people are not looking for oscar winning movies! you better understand it! oh....it applies to every other recent movie!
Telugu movies released in Telugu???? of course! you guys hail AVATAR in Telugu, that's why!!!
ReplyDeleteits not a problem, if you don't know how to praise, its worst if you don't know who to criticize??
I challenge you write reviews on Hugo and The Artist, by that, we will decide your capability and give some respect to your criticism!!!
just dont look for their reviews in blogs, write your own stuff!
we will check how much you knew about screenplay, camera......etc.......
do you think its so funny??? to criticize Telugu movies??? ha???
come into the industry...try making a movie! you IDIOT!
try making a short movie (2mins) at least.....you....I don't even know what to call you!
అనానిమస్ గారు, మార్కెట్లో మీరు ఒక వస్తువు కొన్నారు. అది మీకు నచ్చలేదు. అలా అని అది చెత్త ప్రోడక్ట్ అని తిట్టకుండా వదిలేస్తారా? లేక ఆహా ఈ ప్రోడక్ట్ తయారుచెయ్యడానికి ఆ తయారీ దారుడు ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని గుర్తించాలి లేదా మనకూ ఆ వస్తువు తయారు చేసే విధానం ఖచ్చితంగా తెలుసుండాలీ అప్పుడే తప్పొప్పులు నిర్ణయించాలి అని పిచ్చివాగుడు వాగుతారా?
Deleteఈ గబ్బర్ సింగ్ అనే సినిమాను కూడా ఒక షో వరకు చూడ్డానికి నేను టికెట్ కొన్నాను. ఒక ప్రేక్షకునిగా అది నాకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అది నా ఇష్టం. అంతేకానీ, సినిమా తియ్యడం చాలా కష్టం అన్జెప్పి నచ్చలేదో లేదో తెలియజేసే హక్కు మాకు లేదనడానికి మీరెవరు?
యస్, నాకు సిన్మాలు తియ్యడం రాదు. స్క్రీన్ ప్లే అంటే తెలీదు. కెమెరా పట్టుకోవడం అస్సలు రాదు. అంతమాత్రనా నేను చూసిన సిన్మా గురించి నా అభిప్రాయం చెప్పడానికి అర్హత లేదందువా హెంతమాట హెంతమాట...
That product you are talking about, you use it!!! you will complain only if you find it useless!! movies are not like that!
Deletethey wont serve an individual's requirements! products of other types, they do!
I wonder how could you compare these two??
and then, yes, when you say, salt is less in this idly, it does mean that you knew how much salt is required for the idly!! don't you??
in the same way...movies too....criticism is a respected profession, and its not for like you amateurs!!
moviemakers, that too freshers, takes it serious! anything fake like you and other bloggers.....serious man! they think that you are some pro!
no, you don't, just cuz you have some 50 bucks doesnt mean that you can comment on anything!!! no!!! better learn this now!! talk to me when you have learnt something about movies....telugu movies, in particular! because they dont fit in the world cinema!
why not!! try comment on satyajit ray's movies??? did you even know about him??no, you dont have a right, because you have 50 bucks!!! no one minds you, if you download it for free!
>>"criticism is a respected profession, and its not for like you amateurs!!"
Deleteనేను క్రిటిక్నూ కాదు, రివ్యూ రాయడం నా వృత్తి అస్సలు కానే కాదు. నేను చూసిన సినిమా గురించి ఏదో నాలుగు ముక్కలు రాస్తే ఏదో ఫీలయ్యింది తమరే... అది కూడా పోస్ట్ పూర్తిగా చదవకుండా.. :-)
>>"moviemakers, that too freshers, takes it serious! anything fake like you and other bloggers....."
ప్రపంచంలో ఎక్కడెక్కడో ఎవడెవడో రాసే అడ్డమైన చెత్తంతా చదువుతూ కూర్చుంటారన్నమాట. మళ్ళీ సీరియస్‌గా తీస్కోవడం ఒకటి. నిజమేనేమో, ఆ మధ్య ఇదే బ్లాగుల్లో ఎవుణ్ణో తిడుతూ పిచ్చిపిచ్చిగా తిట్లు రాస్తే వాటిని కూడా తీస్కెళ్ళి సినిమాల్లో పెట్టుకున్నారు కొన్నిటిని. :-)
>>"just cuz you have some 50 bucks doesnt mean that you can comment on anything!!! "
ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమౌతోందా...
>>"why not!! try comment on satyajit ray's movies???..."
నేను తెలుగు సినిమాలు తప్ప ఇతర భాషా సినిమాలు చూడను. ఎందుకంటే నేను తెలుగుభాషాభిమానిని. నా డబ్బుల వల్ల తెలుగువాళ్ళకే, తెలుగుజాతికే కాస్తో కూస్తో ఉపయోగపడాలని కోరుకునే స్వార్థపరుణ్ణి. పరాయిభాష నటుల గురించి, డైరెక్టర్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరమూ కానీ, ఇంట్రెస్టూ కానీ నాకు లేదు వాళ్ళెంత గొప్పోల్లైనా సరే...
write your OWN reviews about last year OSCAR winners, and we will know what your stuff is...and hence...will follow you....OK????
ReplyDeletedont just piss in the blogs just because you got space!!!
నేను రాసింది రివ్యూ అని ఎక్కడా చెప్పలేదు. జస్ట్ సినిమా చూశాను, నా అభిప్రాయం ఇదీ రాశాను. ముందు మీరు పోస్ట్ పూర్తిగా చదివి ఉంటే అర్థమయ్యేది.
Deleteఅనానిమస్ గారు, ముందు మీరు పోస్ట్ పూర్తిగా చదవండి. ఆ తర్వాత పోట్లాడుకుందాం. :-)
ReplyDeleteThe way you are handling that firey Anon is amazingly cool, Rasp! I liked it.
Deleteరాంలింగా,
Deleteఓ చెత్త హోటెల్లో ఇడ్లి తిని, అవి మీకు నచ్చక ఎంత చెత్తగా ఉన్నాయో అని వాపోవటానికి, మీకు కావాల్సిన క్వాలిఫికషన్లు ఏమిటి అంటే, అసలు ఇడ్లి పిండి ఎలా రుబ్బాలో, ఇడ్లి లు ఎలా వేయాలో తెలియాలి అనీను మరియు ఓ తాజ్ లోనో, అధమం మేరియాట్ లోనో ఇడ్లి ల గురించి చెప్పాలనీను పైన అనామకుల ఆదేశాలు!!,
చివరగా మీ బ్లాగులలో ఏమి వ్రాసుకోవాలో ఎలా వ్రాయాలో కూడా మీ బ్లాగులోనే కామెంట్లు పెట్టే అనామక పంఖా ల మాట మీద పోవాలని, పైన అనాముకుల ఏడుపులు అర్ధం అన్నమాట, అర్ధం చేసుకోరూ :)
అనానిమస్ గారు, కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్....సింపుల్‌గా ఇడ్లీ కాన్సెప్ట్‌తో భలే explain చేశారు. :-)
Deleteyou can judge the taste of an idly, only if you know what are the standards for the taste of an idly!!! If you dont know the standards, then your judgements are not accepted!
DeleteIts all obvious that if you show "The Artist", to the andhra mass audience, they wont make it a hit, but knowing what, they will make a hit, and bringing it on to the screen is not as simple as you write this blog!
do you all think that the telugu director didnt know, that all those logic defying things being done by the heroes is ridiculous??? they do! but they had to!
overall all telugu movies are the same! try to understand why people are encouraging only some of them!
dont just go on thinking that telugu directors are brainless, after all a product of them is collecting crores of money!
ఓర్నాయనో...ఉప్పెక్కువైంది, కారం తక్కువైంది అన్జెప్పడానిక్కూడా ఇడ్లీ స్టాండర్డ్స్ తెల్సుకోవాలా.. :-)
Deleteనేను సాధారణ తెలుగు ప్రేక్షకుణ్ణి వయ్యా... బాగుందా, బాగాలేదా అన్నదే నాకు కావాల్సింది. ఇక హిట్టు ఫట్టుల గురించి చెప్పుకుంటే చానా అవుద్ది. ఎప్పుడో ఒక మాస్ సినిమా హిట్టయ్యి కోట్లు కలెక్షన్స్ వస్తాయి, అంతే దాన్ని చూపించి మాస్ సినిమాలైతేనే రికార్డ్ కలెక్షన్స్ వస్తాయని చెప్పి అవే మూసలో సినిమాలు తియ్యడం అందరూనూ...
తెలుగు డైరెక్టర్స్‌కు బ్రెయిన్ లేదని నేనెక్కడా చెప్పలేదు. వాళ్ళకు ఉన్నాలేకపోయినా మాకనవసరం. కానీ చూసే ప్రేక్షకులు బ్రెయిన్లెస్ కాదని తెల్సుకోమని చెప్తున్నాము. :-)
నేను సాధారణ తెలుగు ప్రేక్షకుణ్ణి వయ్యా... బాగుందా, బాగాలేదా అన్నదే నాకు కావాల్సింది.
Deleteidi cheppadaaniki nuvvu evvadivayyaaaaa??? on which basis you will tell????? nuvvu emainaa pudingi vaaaa, to represent everybody else?????
కానీ చూసే ప్రేక్షకులు బ్రెయిన్లెస్ కాదని తెల్సుకోమని చెప్తున్నాము. :-)
nijamaaa.....nuvvu eki paaresina....this very movie is collecting crores!! better know about it!!!
now either they should be brainless or you should be....to write like that!! isn't it??
no, I am no fan of anybody! all I care is telugu industry...and we dont need your crap.....
If you are so much talented to review our movies and decide everyone of them are crap.....I think the best suited for you is either the bollywood or hollywood!!
they would match up with your criticizing talent! oh...not them either.....I don't have any idea if they make movie on mars and venus!!! yeah!
so, enlighten us with your brilliant analysis of hollywood movies! please! at least, they could serve your talents, right???
saradaagaa raastunnaaamani....escapism okati malleee!!!!
aa toilet gaadu, we dont even know whether he watches movies, because they get played rarely in the toilets....but it will comment!!! SNKR i meant! he has all under his contract, railways, busstands, sulabhs....airports too...I guess..!
you will be subjected to questions if you are not fully aware of what you are writing!!!
that toilet, SNKR, he passes everywhere, cuz everybody needs a toilet!
నేను సాధారణ తెలుగు ప్రేక్షకుణ్ణి వయ్యా... బాగుందా, బాగాలేదా అన్నదే నాకు కావాల్సింది.
DeleteIf you did not like it, mention it explicitly and better with every reason you have!!! because its your reasons that will make others to guess what you are and whether they have to watch the movie or not!!!
just having a blog, is not an eligibility for this!!!better think of ethical implications before you dump a running movie! lots of lives are on it! and you are neither a certified movie critic, and no reputed movie critic will tell you to not to watch a movie! its a rule they follow!
understood! genius!microsoft programmer?? I definitely knew that you are not at your best in your career, like designing space shuttles for NASA, but I do, know that you wont bear me If I call you a crap! you are a rockstar in your own company if not in the NASA! and there will always be a counterpart for your rockstar status in the NASA too!
just trying to tell you that.....nobody is less, so that you can bark at them as you wish!!
"cuz everybody needs a toilet"
DeleteIs it! :-? I don't think you need any... do you?!
>>"nijamaaa.....nuvvu eki paaresina....this very movie is collecting crores!!"
Deleteకోట్లు కలెక్ట్ చేస్తే నాకేంటి? ఈగలు తోలుకుంటే నాకేంటి? అంతా పబ్లిసిటి మాయ పచ్చి భోగస్ అని వేమన ఏనాడో చెప్పాడు. :-)
హిట్టు ఫట్టు సినిమాలొక్కపోలికనుండు
చూడ చూడ కథల జాడ వేరయా
రికార్డులందు నిజ రికార్డులు వేరయా
పబ్లిసిటీ మాయ పచ్చి భోగసయా...
సినిమాలేమిటి హిట్లేమిటి ఫట్లేమిటి తొక్కేమిటి...నాకు నచ్చితే నలుగురికీ చూడమని చెప్తాను. నచ్చకపోయినా చూడమని చెబుతాను. ఎందుకంటే అవతలి వాడు కూడా నాలాగ బలి కావాలి కాబట్టి. కికికి. :-)
>>"I definitely knew that you are not at your best in your career"
Deleteతొక్కలో సినిమా బాగుందో లేదో చెప్పడానికి కూడా కెరీర్లో బెస్ట్‌గా ఉండాలా!!! Yes. నా కేరీర్లో నేను బెస్ట్ కాదు. కావలనుకోవట్లేదు కూడా. ఏదో నెల నెలా అప్పుల్లేకుండా గడిచిపోతే చాలనుకునే అతి సాధారణ మధ్యతరగతి మెంటాలిటి కలిగిన యువకుణ్ణి. :-)
>>"
DeleteIf you are so much talented to review our movies and decide everyone of them are crap.....I think the best suited for you is either the bollywood or hollywood!!
they would match up with your criticizing talent! oh...not them either.....I don't have any idea if they make movie on mars and venus!!! yeah!
so, enlighten us with your brilliant analysis of hollywood movies! please! at least, they could serve your talents, right???
saradaagaa raastunnaaamani....escapism okati malleee!!!!"
ఎస్కేప్ ఎవడవుతున్నాడహే ఇక్కడ... అవ్వాల్సిన అవసరం అస్సల్లేదు. పోస్ట్ చదివి అర్థం చేసుకోవడం చేతకాని నీకు తెలుగు సినిమాలు అర్థమవుతాయంటే నాకు డౌటే...
బాలివుడ్డు, హాలివుడ్డు, గాడిదగుడ్డు... అవేమన్నా కొలమానాలా ప్రతీ సినిమా బాగుండటానికి. ఆ మధ్యకాలంలో ఫ్రెండ్స్ బలవంతం మీద కొన్నిటిని చూశాను. వాటిని కూడా ఇంతకన్నా దారుణంగా ఏకి పడేశాను. నచ్చకపోతే ఏకడం ఎక్కడైనా కామనే... దానికి ఏ గాడిదగుడ్డు సినిమా అయినా ఒక్కటే...
కొత్తగా ఆర్టిస్టుగా ట్రై చేస్తున్నానంటున్నారు... ఏమన్నా ఛాన్సులు ఇప్పించమంటారేమిటి? ఏదీ తమరు నటించిన ఏదైనా ఒక సీనో లేదా ఏదైనా తమరు తీసిన షార్ట్‌ఫిల్మ్ ఉంటే ఇక్కడ లింకివ్వండి. :-)
/dont just piss in the blogs just because you got space!!!/
ReplyDeletehaa haa haa
I understand your plight ;) as a self designated public toilet cleaner.
శంకర్ గారు, :-))
Delete@ SNKR, as you have agreed that you are a toilet, the anonymous has no problems to be your cleaner....after all, cleaner is better than the toilet itself. isn't it?
Deleteఓస్ అంతేనా! ఈ మాట ముందే చెప్పివుంటే రైల్వే టాయిలెట్ కూడా కలుపుకుని వుందునుగా! మీ సరదా తీరాలే కాని... అవును టాయిలెట్ కన్నా క్లీనరే గొప్ప(కంపారిజన్ బాగుంది), నే రెడీ... బేగ వచ్చేయ్ :))
DeleteSnkr
yeah....aaa.. railway lo...kampu anthaaaa goodaaaa....needenaaaa???? em vai??? i saw your comment on other blogs tooo!!! more than stinking!!!
Deleteslumdog millionaire lo aa pillagaadivi nuvve ani teliyalaaa annna!!! carry on!!! ninnu clean cheyyadam maaaa valla kaadule!!!
aaaa ganga digi vachinaa koodaaa avvadule kaanee....nuvvu kaaneee...
mukkulu moosukoni meme veltamle....
baagaaa mudiri poyyav!!!!
just go get your morning dose of HARPIC! OK! If its already night, and you are in the busstand, just pay them, they will clean you! OK! just pay them enuf!
DeleteBTW, I had seen your stink all over the blogs, you are neither a blogger but show some sort of superiority in every comment you make??
did u never think that, it is some sort of oddity, stupidity??? anyway, what a toilet knows??? and who cares???eh? SNKRToilet??
both the post and the comments are simply wow. Gun shots from Gabbar Singh? :)
ReplyDelete<<<<>>>>
ReplyDelete30 సార్లు మన పవన్ కల్యాణ్ చూసాకే, 31 వ సారి తన తమ్ముడు కోసం సినిమా కు వచ్చాడండీ..అందుకే ఇంట్లోనుండి వెళ్ళెటప్పుడు తమ్ముడ్ని కొట్టి నువ్వు తప్పు చేసి నన్నిరికిస్తావ్రా అని కొట్టి పారిపోతాడు ;)
If you don't know which is a good script, which is a best cinematography...how could you comment on them??
ReplyDeletein your words, if you never knew the best idly taste, how could you comment on every idly you come across??
you have to compare with something right??? you just can not say 5 cm is long! can you??
but the alternative is having a grip on the trade! that is out of question! isn't it?
I would show you a programmer in Microsoft and call a ameerpet company programmer as crap! would you agree??
అనానిమస్ గారు, స్క్రిప్ట్లూ, సినేమాటోగ్రఫీల గురించి నాకెందుకండీ. ఒక ప్రేక్షకుణి దృష్టిలో సినిమాలకు కొలమానం స్క్రిప్ట్లూ, సినెమాటోగ్రఫీలూ కాదండీ. సినిమా చూస్తున్నంత సేపూ వేరే ప్రపంచం మర్చిపోయి సినిమాలో లీనమైపోయామా లేదా సినిమా చూడ్డం వల్ల సరదాగా కాలక్షేపం అయ్యిందా లేదా తదితర అంశాలే ఇక్కడ కొలమానం. ఈ కొలమానాన్ని కొలవడం సాధ్యం కాదు. అందుకే ఏ సినిమా హిట్ అవుతుందో, ఏది ఫట్ అవుతుందో ఎవరూ చెప్పరు చెప్పలేరు. ఈ ప్రపంచంలో ప్రతీ విషయాన్ని కొలవలేం అన్న సంగతి తెలుసుకోండి.
Delete>>"if you never knew the best idly taste, how could you comment on every idly you come across?? "
అమ్మ చేతి వంటనూ, పెళ్ళాం చేతి వంటనూ కంపేర్ చెయ్యట్లా... ఇదీ అంతే. :-)
సరే, ఇడ్లీ టేస్ట్ గురించి శంకరాభరణం స్టైల్లో చెప్పుకుందాం.
అ. ఇడ్లీని సాంబార్‌తో మాత్రమే తినడం అలవాటు పడ్డవాడికి, చట్నీతో ఇస్తే నచ్చకపోవచ్చు
ఆ. ఇడ్లీని వేరు శనక్కాయల చట్నీతో తినడం అలవాటు పడ్డవాడికి, సాంబార్‌తో నచ్చకపోవచ్చు
ఇ. సాంబార్, చట్నీ, అల్లం చట్నీ తదితర అన్ని రకాల చట్నీలతో తినడం అలవాటు పడ్డవానికి ఏ ఒక్కటో ఇస్తే ఇడ్లీ అస్సలు తినలేకపోవచ్చు
ఈ. జ్వరం వచ్చినోడికి ఏ స్టాండర్ట్ ఇడ్లీ ఇచ్చినా చేదుగానే ఉంటుంది
ఎ. బబుల్ గమ్ లాగా సాగే ఇడ్లీ ఒకడికి నచ్చితే, రవ్వతో చేసే ఇడ్లీ ఇంకోడికి నచ్చుతుంది.
>>"I would show you a programmer in Microsoft and call a ameerpet company programmer as crap! would you agree??"
ఇక్కడ చూడాల్సింది ఎవడు గొప్ప అన్నది కాదు. ఎవడు ప్రోగ్రామ్ రాస్తే అవుట్‌పుట్ బాగా వచ్చిందన్నదే ముఖ్యం. ముఖ్యంగా ఆ ఇద్దరూ రాసే ప్రోగ్రామ్స్ మనకు అవసరమా కాదా అన్నది మరీ మరీ ముఖ్యం. :-)
"If you don't know which is a good script, which is a best cinematography...how could you comment on them??"
Deleteఅజ్ఞాతగారూ జేమ్స్ కామెరూన్ తీసినా లోకల్ గా జఫ్ఫా డైరక్టర్ తీసినా అసలు సినిమా బావుందో బాలేదో తేల్చాల్సింది ప్రేక్షకుడేనండీ. సినిమా తీయడం రాదుకదా అని ప్రేక్షకుడికి సినిమా చూసే అర్హత లేదు అని బుద్ధున్న ఏ డైరక్టరూ అనడు.
మీరు చేప్పేదాన్ని బట్టి మీకు వంటచేయడం రాకపోతే మీరు ఏమీ తినరన్నమాట. బావుంది అలాక్కానీండి. అవునూ ఇంత అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు, కొంపతీసి మీ పేరు మార్తాండా? :)
శంకర్ గారు, హ హ కెవ్వ్వ్వ్వ్వ్వ్... మార్తాండ దగ్గర శిష్యరికం చేశారనుకుంటా... :-)
Delete@Anonymous,
DeleteJust accept the criticism. Telugu movies lo logic vetakadam waste ani andariki telisinde.
Ee movie gurinchi, andaru PK oneman show ani antunnaru, migilina technical aspects added flavors. Even director is agreeing with it, why are you so concerned.
Be a Pawan fan (if you are one), dont care about what others think or talk about him or movie, just enjoy his screen presence.
Instead of wasting your time and energy here, go, watch it one more time and enjoy.
-- Badri
you compare cooking and movie making....??? how funny??? seems like there is nothing else you know other than cooking idly sambar and eating it!!! eh? Mr.SHANKAR??
Deleteyou should know something about the art before you criticize it!!! dont you?? if not, you are nothing but barbarians!! eh?? MR.SHANKAR????
idly making and movie making are not one!! you idiot!!
you talk about the quality of a TV, you would at least know whether its a LCD or LED etc? and their pros, cons etc!!!! wont you??
all their lives these guys might have watched a 100 odd telugu movies....and they come criticizing everything as if they are some pros!!!!
edee teliyakundaaa....vaagithe.....chetha......naa...ninne....SHANKAR!!
సినిమా తీయడం రాదుకదా అని ప్రేక్షకుడికి సినిమా చూసే అర్హత లేదు అని బుద్ధున్న ఏ డైరక్టరూ అనడు.
DeleteI did neither said so....this blogger said so....
మీరు చేప్పేదాన్ని బట్టి మీకు వంటచేయడం రాకపోతే మీరు ఏమీ తినరన్నమాట. బావుంది అలాక్కానీండి. అవునూ ఇంత అడ్డదిడ్డంగా వాదిస్తున్నారు, కొంపతీసి మీ పేరు మార్తాండా?
No, you a mega IDIOT!! its not for eating, everybody is welcome for eating!!! its for criticizing!!! as if they are some heros of that trade!!!! understand??? nee burra made of nalla mattaaa???
"you should know something about the art before you criticize it!!! "
Delete----
అవునా చెత్త అనామకా, మరి వేరే వాళ్ల బ్లాగులలో కామెంట్లు ఎలా పెట్టాలో తెలియకుండా కామెంట్లు, పెట్టే వెర్రి పూవులను ఏమంటారు? ముందు చెత్త కామెంట్లు పెట్టే ముందు అసలు బ్లాగులు అంటే ఏమిటి, వాటి పుట్టు పూర్వోత్తరాలు, అందులో కామెంట్లు ఎలా పెట్టాలి, బ్లాగు పద్దతులు ఏమిటి అని కనీసం జ్ఞానం లేని జఫ్ఫా గాళ్లు కామెంట్లు పెడుతూ, ఆపైన వాటికో లెక్చర్లా వెర్రి పప్పా!! ముందు అవి అన్నీ తెలుసుకొచ్చి ఆ తరువాత బ్లాగులో కామెంట్లు criticize చెయ్యమ్మా!!
నీ యెంకమ్మ, మన వెథవ డైరెక్టర్లు కాపీ కొట్టి తీసే మసాల మొవీ లేమే నీకు ఆర్టా, అమ్మలు వండిపెట్టె వంటలేమో ఆర్ట్ కాదా? అద్దంలో మొఖం చూస్కుకొని రా మార్థాండా శిష్యా :), కొంపదీసి తమరు కూడా లండన్‌లో జూనియర్ డాక్టర్ కాదు కదా?
సినిమా తీయడం రాదుకదా అని ప్రేక్షకుడికి సినిమా చూసే అర్హత లేదు అని బుద్ధున్న ఏ డైరక్టరూ అనడు.
DeleteI did neither said so....this blogger said so...
sorry...you overwhelm me with your idiocy!
fact is....you are welcome to watch the movie....dont pass judgements as if you are some certified critics!!, which you are not nd which you could never be..with your muddy brains!!!
that's what i am talkin bout!!
guddu pette daaniki telusu ani.....
ippudu annnaa artham ayindaaa???no....you cant!!i know it!!
devudiki poojala kannaa.....ganta ki debbalu ekkuvanee.....prathi vakkadooo kottevaade....50 roopayalu chetilo vunte chaaalu!
no, no I am not doctor, just an aspiring movie artist, as I have seen the recent trend in the blogs, so I had to respond like this!!
Deleteand of course, dont give us lectures about blogs and protocols!!!OK!!
and dont tell us what to make and how we should make movies!
we as well know it....right, guys?
If you cant see telugu movies, please dont!!!, go and watch hindi or hollywood movies, and show your talent of writing reviews on them!!! OK???
they are upto your talents! right!! just go on!!!
"dont give us lectures about blogs and protocols!!!OK!!'
Delete----
హవునా, తమరేమో ఎవరి బ్లాగులో ఎవరు ఏమి వ్రాసుకోవాలో మాత్రం చెబుతారన్నమాట!! good logic :)
"dont tell us what to make and how we should make movies!
----
"us' అంటే ఎవరు? తమరేమన్నా industry మొత్తానికి wholesale, spokesperson లాగా మాట్లాడుతున్నారు? మీకు తెలుస్తే తీసుకోండి, తీసుకొని మీ ఇంట్లో వేసుకొని చూసుకోండి, అంతే కాని ఒక్కసారి పబ్లిక్ కు రిలీస్ చేసిన తరువాత, అది చూసిన పబ్లిక్ మాట్లాడకూడదు అంటే ఎట్లా ఆర్టిస్ట్‌ల సంఘం అధ్యక్షా?
అయినా మేము చూస్తాం, నచ్చుతుందో, నచ్చలేదో చెబుతాం, వాటికే బ్లాగులు ఉన్నాయి, వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పుకోవటానికే బ్లాగులు పుట్టాయ్యి అన్న కనీసం జ్ఞానం లేని వాళ్లు కూడ కామెంట్లు పెట్టగా లేనిది, నాకు సినెమా నచ్చలేదు అని తన సొంత డబ్బులుతో సినెమా చూసి, తన సొంత బ్లాగులో అభిప్రాయాలు వ్రాసుకోవటం తప్పు ఎలా అవుద్ది మహాశయా?
నీకు నచ్చకపోతే బ్లాగులు చదవకుండా నెత్తిన తడిగుడ్డ వేసుకొని పడుకోక, సినెమాలు చూడొద్దు అని చెప్పటానికి నువ్వు ఎవరు? ఆ ముక్క నా బ్లాగు చదవమని నీకు ఎవరు చెప్పారురా కుంకా అని రాస్బెర్ర్య్ అంటే మొహం ఏడ పెట్టుకొంటావ్?
ఇంతకీ తమరు aspiring artist అని చెప్పుకొనే అర్హత ఉందో లేదో అని ఒక్క సారి అన్న చేసుకొన్నారా?, ప్రతోడు artist అని ఫీల్ అయ్యి, వచ్చి బ్లాగు protocals తెలియకుండా కామెంట్లు పెట్టేవాడే!!!
p.s. London Junior Doctor is a very old joke of telugu blogs. FIRST learn about telugu blog history, before that learn how to blog, open your own blog, LEARN ABOUT TEMPLATES, learn about blog protocols, learn about HTML/JAVA, before that learn about 8086/6800 chipsets and PERSONAL COMPUTING, learn about INSCRIPTING, then COMMENT in blogs,OK!! :)) ఓ కామెంట్ పెట్టటం వచ్చు కదా అని ప్రతోడు ఎగరేసుకొంటూ వచ్చి కామెంట్లు పెట్టేయటమే, హమ్మా !!
వీడు మార్తాండలా పనీ పాట లేని జఫ్ఫానే కాని ఆ పెద్ద రాతలు మార్తాండ రాయడు, చిన్నగా కొరుక్కుతింటుంటాడు. రాస్ప్బరీ రామలింగం మిమ్మల్ని మరో టపా రాయనీయకుండా ఎలాంటి చిన్నమెదడు చితికిన యదవలు అడ్డుపడుతుంటారు. మీరు ఇంటర్వల్ తరవాతి పార్ట్ రాయండి.
Deleteబాబూ అజ్ఞాతలూ కనీసం కామెంట్ కింద మీ పేరైనా రాసుకోండి. పది మంది అజ్ఞాతలు పది రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ఏ కామెంట్ కి ఏ సమాధానం చెప్పారో తెలియటం లేదు.
Deleteఇకపోతే అజ్ఞాతంగా మిగిలిపోయిన వర్ధమాన నట శిఖామణీ ఈ కామెంట్ పెట్టింది నువ్వేనా?
"you should know something about the art before you criticize it!!! dont you?? if not, you are nothing but barbarians!! eh?? MR.SHANKAR????"
నాకు సినిమా చూడ్డం వచ్చు తమ్మీ.అది చాలు క్రిటిసైజ్ చేయడానికి. ఎనీ డౌట్స్?
Saamuloru manchineeti to koodaa manta petteyagalaru ;-) :P
ReplyDelete-- Badri
బద్రీ, హ హ కాంప్లిమెంట్ బాగుంది. నాకు బాగా నచ్చింది. "మంచినీటితో మంట పెట్టేస్తా" అని నా ఫ్రొఫైల్లో రాసుకుంటా...వీలైతే నా బ్లాగు క్యాప్షన్ కూడా అదే పెట్టుకుంటే బెటరేమో... :P
Deleteబై ద వే బస్సు ఎలాగూ లేటుగా వస్తుందని తెలిసింది కాబట్టి, ఇంకో సారి వెళ్ళి సెకండాఫ్ కూడా చూసి రావచ్చుగా... :)
ReplyDeletepuranapandaphani గారు, హ హ ఆ ఛాన్స్ ఉంటే తప్పకుండా వెళ్ళేవాడిని. :-)
DeleteRaspRam garu waiting for next half
ReplyDeleteఅనానిమస్ గారు, హ హ తప్పకుండా... వీలుచూసుకొని ఈ వీకెండే రాస్తానులెండి. :-)
Deleteఅసలేం జరుగుతోందిక్కడ? ఎవరికైనా తెలిస్తే చెప్పండి :) Please...(రాత్రే నేను కూడా ఆ సిన్మా చూశా..వృద్ధ నారీ నృత్యం వరకు )
ReplyDeleteపావని గారు, వృద్ధ నారీ నృత్యమా? కొంపదీసి ఈ నృత్యాన్ని నేను చూస్తున్న థియేటర్లో డిలీట్ చెయ్యలేదుకదా? అయ్! ఎలిగింది ఎలిగింది. మీరనేది "కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్...కేకాఆఅ" సాంగ్ గురించేనా? :-)
Deleteఆ అనామకుడు ఇంకా ఇక్కడే తచ్చాడుతున్నాడా?! :))
ReplyDeleteఆ ఏడిచేదేదో రెండుముక్కల్లో క్లుప్తంగా, అర్థమయ్యేలా ఏడిస్తే... ఏమన్నా చేయొచ్చు, అలా రంగనాయకి సీరియల్ నవల్లా కామెంట్లు రాయాలా! :P
ఈ టపాకు సంబందించిన వ్యఖ్య కాదు కాని చదవండి.
ReplyDelete* వృద్ధ నారీ నృత్యమా? *
వయసు వచ్చే కొద్ది వారి విలువ అమాంతంగా పడిపోతుందనటానికి ఈ వ్యాఖ్య సాక్షం. మలైక లాంటి వారు అందం కొరకు తిండి తిప్ప మానుకొని, కళాకాంతి లేని మొహంతో, మోహాన్ని రేకెత్తించట్టానికి, కోక కట్టుకోకుండా మలైక ఎంత తైతక్కలు వేసినా, జారిపోయిన బీరకాయలను పైకి పట్టి బందించి,వాటిని బిగించి తన బిగువులు ఇంకా సడలేదని చూపించటానికి, పడేపాట్లు చూస్తే మగువల జీవితం మీద విరక్తి కలుగుతుంది. వారుఎంత ఎగిరినా మగవారి చలనం కలగదు సరి కదా ఈ వయసులో ఎందుకు కష్ట్టపడతావు ఇంట్లో కూచో అని చెప్పాలని పిస్తుంది . మనమాటలు వారికి రిచ్ ఆయేది ఎలా? ఇక ఈ మధ్య ఐశ్వర్యా రాయ్ విషయానికి వస్తె, ఒక కానుపైంది పదింతల లావైంది.
హతవిధి! ఈ బీరకాయలను భుజాన వేసుకొన్న వారితో, గజలక్ష్ములతో సంసారం చేయటమంత దుర్భరమైన నరకం మన మగవారికి ఇంకొకటి ఉండదు.
మరి ఇజియనగరం ఆలుగడ్డ సేమ్య ఎక్కడ చూసినా స్రీ పురుషులు సమానం తెగ వాగుతుంట్టుంది. 50సం|| వయసు వస్తున్నా ముగ్గురి ఖాన్ ల దేహ సౌందర్యం, వారి విలువ, హవా కొంచెం కూడా తగ్గలేదు. వారి తో పాటుగా కేరిర్ మొదలు పెట్టిన హీరోయిన్ ల మార్కేట్ విలువ అమాంతంగా సున్నాకు పడిపోయింది.
అనానిమస్ గారూ, సమానత్వం గురించి చాలామంది చాలా రకాలుగా రాస్తున్నారు. ప్రత్యేకంగా సౌమ్యా గారిని టార్గెట్ చెయ్యడం చూస్తోంటే మీకూ, సౌమ్య గారికి ఏవో పాత కక్షలున్నట్టున్నాయి. దానికి నా బ్లాగుని వేదికగా వాడుకోవడం పద్ధతి కాదు.
Delete>>"వయసు వచ్చే కొద్ది వారి విలువ అమాంతంగా పడిపోతుందనటానికి ఈ వ్యాఖ్య సాక్షం."
ఇక్కడ పడిపోయేది వారి విలువ కాదు, అందం విలువ. అందుకే మన పూర్వీకులు "అందం శాశ్వతం కాదు" అన్నది. శారీరక దేహ దారుఢ్యంతో, అందంతో స్త్రీ-పురుషుల సమానత్వాన్ని కొలవలేం. ఎవరికి వారికి ప్రత్యేకంగా సగం సగం బాధ్యతలు అప్పజెప్పాడు ఆ దేవుడు. ఆ బాధ్యతలు తెలుసుకున్న జంట సంసారం బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. అలా కాకుండా ఏదైనా unbalance జరిగితే బలం ఎవరివైపు ఎక్కువుంటే ఆ దిశగా మిగతావారు నడుస్తారు. దాంతో మిగతావానికి అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిగా ఉన్నవాడు బలంగా ఉన్నవాళ్లని ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ వ్యతిరేక బలాన్ని ప్రయోగిస్తూ ఉంటాడు. ఎంతవరకు అంటే ఆ ఫోర్స్ బ్యాలెన్స్ అయ్యేవరకు. బ్యాలెన్స్ కాకపోతే వాడి జీవితం అసంతృప్తిగానే ఉండిపోతుంది. (ఈ మూడు లైన్లల్లో న్యూటన్ మూడు నియమాల్నీ చెప్పేశా...అర్థమైతే పండగ చేసుకోండి):-)
>>"గజలక్ష్ములతో సంసారం చేయటమంత దుర్భరమైన నరకం మన మగవారికి ఇంకొకటి ఉండదు."
మీరు సంసారాన్ని ఏ కోణంతో చూస్తున్నారో నాకర్థం కావట్లేదు. నేనింకా బెమ్మీగాణ్ణి కాబట్టి పెద్దగా నాలెడ్జ్ కూడా లేదు ఈ విషయంలో... కాకపోతే చుట్టూ ఉన్న సమాజాన్ని కాస్తో కూస్తో గమనించాను కాబట్టి నా కర్థమైన రీతిలో చెబుతాను వినుకోండి.
సంసారం కేవలం ఒక ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉండదు. అవి అనంతం. మీరు గజలక్ష్ములతో సంసారం కష్టం అంటున్నారు. అదే రివర్స్‌లో ఆలోచిస్తే, ఏదైనా ప్రమాదవశాత్తూ మంచాన పడిన మొగుడికి సేవ చేయాల్సి వస్తేనో, ధీర్ఘకాలంగా వేధించే రోగాలతో సతమౌతున్న భర్తతో కాపురం ఎలా చెయ్యాలీ అని వాళ్ళు అనుకుంటే..అఫ్కోర్స్, ఇదే విషయం వైస్ వర్సా కూడా అవుతుంది. ఈ టాపిక్ మీద రాస్తూ పోతూ ఉంటే అంతూ పొంతూ ఉండదు. ఇక్కడితో ఆపేద్దాం.
అయినా కాలం మారింది. ఈ కాలంలో ఎవరైనా సన్నబడ్డం పెద్ద కష్టమేమీ కాదు. మీకు గనక పెళ్ళై గజలక్ష్మిలాంటి భార్య ఉంటే ఇదిగో ఈ యాడ్‌లో చూపించిన ప్రోడక్ట్ వాడమనండి. సన్నబడతారంట.
http://www.youtube.com/watch?v=-mwVKTASmqQ
>>"50సం|| వయసు వస్తున్నా ముగ్గురి ఖాన్ ల దేహ సౌందర్యం, వారి విలువ, హవా కొంచెం కూడా తగ్గలేదు."
Deleteఇవ్వాళ కాకపోతే రేపైనా తగ్గుతుంది. ఏదో రోజు హీరోలుగా మానేసి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దిగాల్సినవాళ్ళే...
/నేనింకా బెమ్మీగాణ్ణి కాబట్టి పెద్దగా నాలెడ్జ్ కూడా లేదు ఈ విషయంలో... /
Deleteఅవునా, రాస్ప్!?! జీవితం కాచి, వడబోసి, కషాయం చేసి ఒక్క గుక్కలో మింగేసినవాడిలా వున్నావు, రాస్ప్.
అనాన్కు పైనిచ్చిన రిప్లే చూశాక,... ఇంకా ఏం చేసుకుంటావులే బాబూ, హాయిగా డైరెక్ట్‌గా వానప్రస్తాశ్రమాం తీసేసుకోరాదూ? :)) :P
శంకర్ గారు, డైరెక్ట్‌గా వానప్రస్తానికా...ఈకాలంలో వనాలు సేఫేనంటారా? :-)
Delete>>"జీవితం కాచి, వడబోసి, కషాయం చేసి ఒక్క గుక్కలో మింగేసినవాడిలా వున్నావు."
ఏదోలెండి గత జన్మలో చేసుకున్న పాపాల వల్ల కలిగిన అనుభవాలతో రాశాను.(కొంచెం సిగ్గుపడుతూ) :-)
సెకండాఫ్ రివ్యూ ఇక్కడ చదవచ్చు: http://rasberryrams.blogspot.in/2012/05/blog-post_20.html
ReplyDeleteenti baabu 7 daaka strt kaaleda maaru moola palleturilo dobbichhukunte atlaage untadi maa urilo ellundiki kuda tickets levu neeku anta freega dorukutunte nellore lo s2 lo ippinchu babu neeku dammunte nu chepindi correct ani cheppi neeku dandesi dannam pedata k na
ReplyDelete