Sunday, 20 May 2012

గబ్బర్ సింగ్ -- ఏకుడు రివ్యూ


ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా హీరో తుపాకీ పేలుస్తూనే ఉంటాడని చెబితే చాలు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేస్తాడని. ఈ ముక్క నేనన్నది కాదు ఒక ప్రముఖ దర్శకుడు అన్నారు. బహుశా గబ్బర్‌ సింగ్ డైరెక్టర్ కూడా ఇదే ట్రిక్కును ఫాలో అయ్యి పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా ఒప్పించి ఉంటాడు.

ఫస్టాఫ్ గురించి ఆల్రెడీ ముందు టపాలో రాసేశాను. ఓపికుంటే ముందు టపా చదివి ఇక్కడికి రండి. ఇక్కడ లింకివ్వను. ఎందుకంటే గబ్బర్ సింగ్‌ను ఫాలో అయ్యి తిక్కను తలకెక్కించుకున్నా... ఆయన ట్రెండ్ సెట్టర్ కదా మరి. ఎవడికివాడు ట్రెండ్‌ను సెట్ చేసుకుంటూ పోతే ఫాలో అయ్యేదెవడంటా...

ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌కు వెంకట రత్నం నాయుడు అని ఏదో పేరుంటాది. కానీ, బుడ్డోడు పెద్దయ్యాక "ఈ బుడ్డోడే పెరిగి పవన్ కళ్యాణ్" అయ్యాడు అని తెరమీద రాస్తాడు డైరెక్టర్...అంటే అక్కడ చూడాల్సింది సినిమాలోని క్యారెక్టర్‌ని కాదు, పవన్ కళ్యాణ్‌నన్నమాట. ఇదో కొత్త ట్రెండు సెట్టింగు...



ఫస్టాఫ్ ఫ్యాన్స్‌కు తప్ప మిగతావాళ్ళకు పరమ చెత్త. ఫస్టాఫ్ మొత్తం పవనిజం చూపించడానికే సిన్మా తీశాడు డైరెట్రు. ఆ ముక్క ఇంటర్వెల్ పడ్డప్పుడు ఆయనే చెబుతాడు. ఓరే పిచ్చనా తెలుగు సినీ ప్రేక్షకుల్లారా ఇప్పటిదాకా మీరు చూసింది సిన్మా కాదు రా అది కేవలం పవనిజం. అసలు సినిమా "ఇప్పుడే మొదలైంది" అని పవన్‍కు సైగ చేసి తుపాకీ పేల్చు నా సామిరంగా నీ ఇష్టమొచ్చినట్టు కాల్చుఅని చెప్తాడు.

అప్పటిదాకా చూసిన ప్రేక్షకులంతా పవన్ కళ్యాణ్ లాగా మెడ మీద గోక్కోలేక తల మీద గోక్కుంటుంటారు. హీరోయిన్ స్లమ్ డాగ్‌లో ఉండడమేందీ, విలన్ గాడు బురదలో దొర్లాడడమేందీ, హీరోగాడికి తిక్కేంటి వాడు పేల్చే తుపాకీ గుండ్లకు లెక్కేంటీ, చూస్తున్న మనం ఇలా బుక్కయ్యామేంటీ అని.




సరే, సోదంతా పక్కనబెట్టి సెకండాఫ్‌లోకొద్దాం.

ఇక్కడ విలన్ గురించి కూస్తంత చెప్పుకోవాలి. విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో అంత గొప్పగా ఎలివేట్ అవుతాడని త్యాగయ్యకాలం నుంచి చెప్తున్న సినిమా సూక్తి. కానీ గబ్బర్ సింగ్‌లో విలన్ "అల్లరి నరేష్" సినిమాల్లోలా కామెడీగా ఉంటాడు. ఫేస్‌లో కౄరత్వం చూపిస్తున్నాడో, కామెడీ చేస్తున్నాడో అర్థం కాదు. హీరో దెబ్బ కొట్టిన ప్రతీసారి పుడింగిలాగా ఏదో ఆలోచిస్తున్నట్టు శవాసనం ఒకటి వేస్తుంటాడు. ఆ శవాసనం కూడా వర్షంలో తడుస్తూనో, బురదలో దొర్లాడుతూనో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లోనన్నమాట. బహుశా ఈ సిన్మాలో పవన్ కళ్యాణ్ తాను హీరోని కాదు విలన్‌ని అందుకే నా పేరు "గబ్బర్ సింగ్" అని చెప్పడం వల్ల, ఇద్దరు విలన్లుప్పుడు ఎవడో ఒకడు మాత్రమే స్ట్రాంగ్‌గా ఉంటాడు అని కన్విన్స్ చెయ్యడానికి కాబోలు.

పిల్ల విలన్‌గాడికి గబ్బర్ సింగ్‌ను ఎదిరించడం చేతకాక పై ఆఫీసర్లకు స్కూల్ పిల్లాడిలా కంప్లైంట్లు చేస్తుంటాడు. వచ్చిన ఆఫీసర్లమో గబ్బర్ సింగ్‌ గురించి బాగా తెలిసినవాళ్ళలా ఏదో ఒక వెధవ కామెడీ చేసి పోతుంటారు. మంత్రులేమో ఆ గబ్బర్ సింగ్‌కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోతుంది అంటారు. ఎవడికెక్కిద్ది చూసే ప్రేక్షకుడికా... ఇంద్రసేనారెడ్డి లెవెల్లో ఫ్లాష్‌బ్యాకులున్నట్లు ఒక్కోడు బిల్డప్ ఇస్తాడు. తీరాచూస్తే ఏ ఫ్లాష్ బ్యాకూ లేకుండా చివరిదాకా నడిపించాడు డైరెట్రు. కనీసం ఎక్కడా కూడా  హీరోకూ, మంత్రికి, మిగతా పై ఆఫీసర్లకూ ఉన్న రిలేషన్ ఏంటో, గబ్బర్ సింగ్‌కు అంత ఫాలోయింగ్ ఎక్కడ్నుచ్చొచ్చిందో ఎక్కడా లవలేశమాత్రమైననూ వివరించే ప్రయత్నం జరగలేదు.బహుశా అదే ట్రెండ్ సెట్టింగ్ ఏమో...సమరసింహారెడ్డి నుంచి వరుసగా ఫ్యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్‌లున్న సినిమాలొస్తున్నాయి. వాటిని చూసిన ఎక్స్‌పీరియన్స్‌తో మీరే ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఊహించేసుకోండని డైరెట్రు ప్రేక్షకుని ఊహకే వదిలేశాడు. ఆహా, వ్వాటే క్రియేటివిటి.  

ఇక ఊరంతా పదిలక్షలకు పైగా అప్పులు చేసి పక్కా బేవార్స్‌గా తిరుగుతున్న కొడుకు అసలు స్వరూపం ఇరవైఏళ్ళు పైగా పెంచిన తండ్రికి తెలియకపోవడమేమిటో? అంత పెద్ద రైస్ మిల్లు నడుపుతున్నాయనకు కొడుకు ఇలా అప్పులు చేస్తున్నాడు, బేవార్స్‌గా తిరుగుతున్నాడు కాస్త మందలించు అని చెప్పే శ్రేయోభిలాషులే కరువయ్యారా... పోనీ ఆ కొడుకు ఎక్కడో దూరంగా ఉండి అప్పుడప్పుడు వచ్చి పోయేటోడా తెలియకపోవడానికి అంటే అదీ కాదు. పుట్టినప్పట్నుంచీ అదే ఊళ్ళోనే పెరిగి పెద్దవాడౌతాడు. విధివశాత్తూ ఆ బేవార్సే మన గబ్బర్ సింగ్ గారి తమ్ముడన్నమాట. ఆ బేవార్స్‌ను, ఆడి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకునే కథను క్లైమాక్స్ దాకా లాక్కొచ్చాడు డైరెక్టర్... ప్చ్...  

పెళ్ళి చేసుకోనని మొండికేస్తున్న హీరోయిన్‌తో ఒక చోట హీరో అంటాడు. "నేను ట్రెండ్ ఫాలో అవ్వను...సెట్ చేస్తా" అని. పెళ్ళిలో కూడా ఏం ట్రెండ్ సెట్ చేస్తాడబ్బా అని ఆసక్తిగా చూశాను కాసేపు. హుమ్మ్..." పెళ్ళిపీటల మీద హీరోయిన్ పక్కన కూర్చున్న జప్ఫా గాణ్ణి భయపెట్టేసి ఈయన చేసుకుంటాడన్నమాట". అదేనండీ రొటీన్‌గా మనం చూస్తున్న ట్రెండ్ సెట్.


సెకండాఫ్‌లో కేవలం పవన్‌కళ్యాణే కాకుండా కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్లు రావడంతో కాస్త రిలీఫ్... అట్టాగే అత్యాంక్షరీ సీన్ మరో రిలీఫ్...కాకపోతే ఆ అంత్యాక్షరి సీన్‌ను కొద్దిగా సాగదీయడం మైనస్.



ఇంక పవన్ కళ్యాణ్ స్టెప్పుల గురించి చెప్పేదేముంది. ఎంతసేపూ అదే నడుం ఊపుడు.  ఖుషీ సినిమా కాలం నుంచీ చూస్తున్నాం.సరే, ఇక్కడ మా రాజశేఖర్ మాయ్యా పవన్ కళ్యాణ్‌ స్టెప్పులని ఎలా ఇమిటేట్ చేస్తున్నాడో చూడండి.



ఆపవయ్యా...ఆపు...ఏం రాస్తున్నావో తెలుసా... అసలు ఇలా రాయడానికి నీకెవడు పర్మిషన్ ఇచ్చాడయ్యా.. నీకు నిర్మాతల మండలిలో సభ్యత్వం ఉందా, పోనీ కనీసం దర్శకత్వ శాఖలో అనుభవం ఉందా... సినిమాటోగ్రఫీ తెలుసా, కెమెరా ఏ యాంగిల్లో పట్టుకోవాలా తెలుసా? దీన్ని ఎవడైనా రివ్యూ అంటారా... రివ్యూ అంటే తెరమీదున్నోళ్ళ గురించే కాదు, తెరవెనుక ఉన్నోళ్ళ గురించి కూడా రాయాలి. రివ్యూ రాయడం ఒక ఫ్రొఫెషన్..అసలు రివ్యూ రాసే విధానం నీకు తెలుసా? నువ్వూ నీ పైత్యమూనూ....


యస్... నేనూ నా పైత్యమే... నేను రాసింది కూడా నా పైత్యమే...తెరవెనుక ఉన్నోళ్ళ గురించి ఫ్రొఫెషనల్స్ రాస్తారు. నేను ప్రేక్షకుణ్ణి వయ్యా... ప్రేక్షకుణ్ణి. తెరమీదున్నోళ్ళ గురించి కాస్తో కూస్తో తెలిస్తే చాలు నాకు. ఒక్కోసారి అదీ అవసరం లేదు.

 సింపుల్‌గా చివరాఖరిగా సినిమా బాగుందా చూడొచ్చా అంటే చూడొచ్చు. ఈ ముక్క నా ముందు టపాలోనే చెప్పాను. ఎందుకు చూడొచ్చు అంటే చెప్పానుగా ఇట్టాంటి సైన్మాలు చూడ్డానికి మనం తియ్యడానికి వాళ్ళూ అలవాటు పడ్డారని. ఆర్నెల్లకో మూణ్ణెళ్ళకో ఒకసారి ఇట్టాంటి సినిమా హిట్టవుద్ది దాంతో ఎవడి తిక్క వాడు స్క్రీన్ మీద చూపిస్తాడు మనకు లెక్క వదిలిపోద్ది.





34 comments:

  1. /సింపుల్‌గా చివరాఖరిగా సినిమా బాగుందా చూడొచ్చా అంటే చూడొచ్చు./
    టికెట్ పెట్టా, పెట్టకుండానా? :) ;)

    ఆ తిక్క అనాన్ సారొస్తాడొస్తాడు
    రావా ల్రావా ల్రావాలి :D

    ReplyDelete
    Replies
    1. శంకర్ గారు, టికెట్ పెట్టకుండా అయితే డబుల్ ఓకే... :-)

      Delete
  2. హహ్హహ్హ... ఏం సెప్తిరి ఏం స్పెప్తిరి. అన్ని సినిమాలకు ఇలానే సెప్తిరా లేక ఇదే మొదలా.
    ఏకుడు ఇంకాస్త ఘాటుగా ఉంటే బాగుండేది. ఓసారి 'దబంగ్' చూడండి, ఏమైనా పనికొస్తుంది. అయినా ఫ్యాన్స్ అందరూ ఇదో హిట్ సినిమా అని పండగ జేస్త్కుంటున్నారుగాని, ఇదేం హిట్టయ్యే మంచి(గట్టి) సినిమా కాదు. ఓ ముప్ఫై యాభై రోజులైతే అదే తెలుస్తుంది.

    ..nagarjuna..

    ReplyDelete
    Replies
    1. ఇదే మొదలు నాగార్జునా...ఇంకా ఏం సెప్పలా...ఇంకాస్త ఘాటుగానా, మొన్న ఏదో రాస్తే దానిమీదే ఏడిచారు అనానిమస్సులు...

      >>"ఓ ముప్ఫై యాభై రోజులైతే అదే తెలుస్తుంది."
      కాలం మారింది భయ్యా...హిట్టుకు కొలమానం రోజులు కాదు, కలెక్షన్స్..ముఖ్యంగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్. అది దాటితే సిన్మా ఎలాగూ థియేటర్లలో ఉండదు. మహా అయితే పక్షం రోజులాడితే గొప్ప ఏ సైన్మా అయినా..

      Delete
  3. >>ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా హీరో తుపాకీ పేలుస్తూనే ఉంటాడని చెబితే చాలు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేస్తాడని

    ఇలా అనేది మిల్క్ బాయ్ మహేశ్ అని విన్నానే !!

    ..nagarjuna..

    ReplyDelete
    Replies
    1. బద్ధకం భయ్యా బద్ధకం. చేతులూ, కాళ్ళూ ఊపి కష్టపడి ఫైట్ చేసేదానికన్నా దూరం నుంచి గన్ పేల్చడం సులభం కదా, అందుకే అందరూ అలా డేట్స్ ఇచ్చేస్తుంటారు. :-)

      Delete
  4. nuvvoo nee bongulo review...akkada cinema hit ayyi andarikee nachite ikkada nee badha ento ardhamkavatledu... got it .. ila -ve ga raste nee blog ki janalu ostarane kada...gud gud....keep it up...pawan peru cheppukoni nee blog ki nalugu raallu sampadinchuko....

    ReplyDelete
    Replies
    1. బ్లాగుకి నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికి పవన్ కళ్యాణ్ పేరే చెప్పుకోవాల్నా ఏంది. మార్తాండ పేరు చెప్పినా చాలు వేల హిట్లు వస్తాయి. బ్లాగుల్లో మార్తాండ ఫాలోయింగ్ ముందు పవన్‌కళ్యాణ్ పిపీలికం. అసలు మార్తాండ ఫాలోయింగ్ చూస్తేనే మెంటలొచ్చేస్తాది ఎవరికైనా... :-)

      Delete
    2. ee marthanda evaru..sodaraa ?

      Delete
    3. lol..martanda naa... O laalu bedaroo...

      Delete
    4. ee marthanda evaru..sodaraa ?
      హ్వహ్వాహ్వా... తినబోతూ రుచులు దేనికీ? అడుగో ఆ పైన గుర్రం మీద వస్తున్న శాల్తీ గిఫ్ చూస్తూ, పోలీసు యూనిఫాం బదులు ముష్టి మావో బట్తలు, ఓ చిల్లులు పడిన కఒబాయ్ టోపీ వూహించుకుని కాసేపు తదేకంగా చూడండి. దర్శనమిస్తారు.

      Delete
  5. worst reviewwwwwwwwwwwwwww neeku taste le du le tammudu okasari neeku nachina cinema edo chete memu chusi taristam

    ReplyDelete
    Replies
    1. kompadeesi sasesham antademo :P

      Delete
    2. కార్తీక్ గారు, నాకు నచ్చిన సిన్మాల లిస్టు చాంతాడంత ఉంది. ఎన్నని చెప్పను. సరే కొన్ని శాంపిల్స్ చెప్తా ఇనుకో...

      అ. ఉపేంద్ర నటించిన భక్తి సిన్మాలన్నీ ఉదాః ఉపేంద్ర, రా, ఏ, హాలీవుడ్, హెచ్ టు ఓ, మొ॥
      ఆ. ఆర్. నారాయణ మూర్తి పోలీసాఫీసర్ గా నటించిన సిన్మాలు
      ఇ. శ్యామ్ అండర్ సన్ స్టెప్పులున్న సినిమాలన్నీ
      ఈ. రాజశేఖర్ బ్రేక్ డ్యాన్స్ ఏసిన సిన్మాలు
      ఉ. పవన్ కళ్యాణ్ నారదుడిగా నటించిన సిన్మా
      ఊ. నాగార్జున యముడిగా వేసిన సిన్మా
      ఎ. వెంకటేష్ భరతనాట్యం చేసిన సిన్మా
      ఏ. బాలకృష్ణ ఒక్క మగాడు, విజయేంద్రవర్మ, అల్లరి పిడుగు (పది సార్లు చూశా)

      మిగతా లిస్ట్ గుర్తొచ్చాక చెబుతా....

      Delete
    3. Veedevado mental krishna laga unnadu..Funny guy...

      Delete
    4. He is just doing all this crappy stuffy as a cheap publicity stuff to gain some attention...

      Delete
    5. Funny guy కరెక్ట్. మెంటల్ కృష్ణ తప్పు. :-)

      Delete
    6. Poniii.... Mental Ramalingadu will suit u better.... :)

      Delete
    7. Ohh god...Balakrishna okka magadu ,vijayendra varma,allari pidugu 10 times chuseva..Deenibatte cheppochu ,ne taste ne judgement..... Pyga veedu malli reviews rayatam...You better change ur id from Rasberry ramalingadu to Mental Ramalingadu..Lol

      Delete
  6. ఈ గబ్బర్ సింగ్ సినిమా హిట్టు పొట్టు అని టాపు లేపు తున్న క్రమం లో ఒక మంచి రివ్యూ రాస్బెర్రీ రామలింగడు....రాసాడు
    "నిజమే ఇట్టాంటి సైన్మాలు చూడ్డానికి మనం తియ్యడానికి వాళ్ళూ అలవాటు పడ్డారని" అది పోవాలంటే
    ఇక్కడ సినిమా కులం అనే మాఫియా నుండి బయట పడాలి .చాన్నాళ్ళ కింద మెరుపు కలలు అని రాజీవ్ మీనన్ ఒక సినిమా తీసాడు దాని మీద మంచి కధనాలు వచ్చాయి
    అది తమిళ్ లో బంపర్ హిట్ తెలుగు లో అట్టర్ ప్లాప్ . కారణం సినిమాలో కథా నాయకుడు ఏ రెడ్డి గారో చౌదరి గారో కాదు ఒక
    మంగలి షాప్ లో బొచ్చు గోరిగే వాడు (వాల్ల మీద గౌరవం తో ), అందుకే ఇక్కడ సినిమా ఆడలేదు అని ఎవరో రాయగా చదివా కొన్ని ఏళ్ళుగా తమిళ్ సినిమాలు చూస్తున్నాను
    అక్కడ షాపింగ్ మాల్ లో పని మనుసులు ప్రేమలో పడతారు మానసిక విక లాంగులు ,పతితులు బాదా సర్ప ద్రస్టలూ జేబు దొంగలు, వేశ్యలూ ఈ సమాజం సృష్టించిన దిష్టి బొమ్మలు అంతా రోగ గ్రస్త మయిన సమాజ చిత్ర పటం సినిమా గా ఆదరించే సంస్కారం చూడగలం .
    మన తెలుగు సినిమాలో అలా ఉందా ట్రెండ్ సెట్టర్ ఒకడు ఉచ్చ పోయించే వాడు ఒకడు. కంటి చూపు . చెవిలో గూబి తో చంపే వాడు ఒకడు ఒకటా రెండా
    ఈ చిట్టా కు అంతం ఉండదు
    75 ఏళ్ళ పండుగ జరుపుకుంటున్న తెలుగు సినిమా ఇప్పటికీ 3 జిల్లాలు , 4 కులాలు ,5 కుటుంబాలు , వాళ్ళ పడక గదులు , వంట గదులు మాత్రం దాటలేదు
    అని నిర్భయంగా చెప్పగలను. దానికి బిన్నంగా తెలుగు సినిమా మాఫియా కుల సమాజం మారిందని నిరూపిస్తే వినమ్రంగా తలా వంచుతా

    ReplyDelete
    Replies
    1. telugu lo ochina johnny cinema chusara meeru , mr. nokia ??? ila manchi cinema lu chala ochi meelanti vallu chudaka utter flop ayinay...intaki aa merupu kalalu chusara meeru...ivevi chudani meeku mana telugu cinema nu titte hakku ledu

      Delete
    2. nijame, vamsa paaramparya picha janaalaki vunnanthavaraku ee janaalani emee analemu, okavela evarainaa annaa manalni dummethipostaaru,
      emantaaru Arun Aryan gaaruuuuuu !!!!

      Delete
    3. నేనైతే జానీ, మిస్టర్ నూకయ్య, ఓ బెమ్మీగాడి కథ, నా ఇష్టం, లవ్ లీ, పూల రంగడు తదితర చిన్నా చితకా సిన్మాలన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేశా. ఏదో నాలాంటివాళ్లుండారు కాబట్టే అప్పుడప్పుడైనా ఇట్టాంటి చిన్న సిన్మాలు రిలీజ్ అవగల్గుతున్నాయి. ఏ పెద్ద హీరో సైన్మా వచ్చినా వారం రోజులకు మించి ఆడని మా ఊళ్ళో పూలరంగడు యాభై రోజులకు పైగా ఆడింది. :-)

      Delete
    4. 3 districts enti bhayya.....as my knowldge krishana....and other 2?

      Delete
  7. సినీమా చూళ్ళేదు (ఇక్కడ మహారాష్ట్ర లో వుండి బతికి పోయా)కానీ రాంలింగడు బెదరూ ...మీ రివ్యూ చదువుతూంటే ఆనందమనిపించింది ...సినీమా హిట్టా లేక ఫట్టా నాకనవసరం .హిందీలో దబంగ్ సరదాగా చూడొచ్చు సొనాక్షి ఇంకొంచెం అందాలు ఆరబోస్తే ఇంకా బావుండేది

    ReplyDelete
    Replies
    1. అనానిమస్ గారు, థ్యాంకులు. ఎనక్కు హిందీ తెరియాదు. అందుకే తెలుగుతో అడ్జస్ట్ ఐపోతున్నా... :-(

      Delete
    2. Naku telisi neeku Hindi a kadu..Telugu kuda triyad and ardamavadu..Anduke ee pichi review lu

      Delete
  8. sorry brothers meerantha balayya fans anukuntanu,, nenu matram evadi fan kaadu,
    cinema anedi commercial , adi cinema lagane vunte baguntundi, ee kaalamlo sankarabaranam theeste chustava, poster chesu vaddankuntav.. meelantollu vundabatte cinema vaallaki kashtalochay---Rams

    ReplyDelete
  9. @Rams Creative Nature: నేను తెలుగు సిన్మా అభిమానిని. తిడుతూనే అన్ని సిన్మాలు చూస్తూ ఉంటా. నచ్చితే నలభై సార్లు చూస్తా, నచ్చకపోతే సిస్టమ్‌లో పెట్టుకొని అందులో నచ్చిన సీన్లనే చూస్తా.. అవతల హీరో ఎవడైనా సరే. బచ్చా గాడైనా సరే, మెగా పవర్ స్టార్ అయినా సరే. :-)

    ReplyDelete
    Replies
    1. Aunu @Rasberyy Ramalingadu..... Neeku balakirshna movies tappite inkemi nachavu..Anduke ila pichipichiga matladutunnav

      Delete
  10. Internet lo oka talk undi edaina super hit aina sinema ni gani leka pote peru prakyatalunna vyaktulani gani nirmohamatam ga nirlajjaga notikocchinattu blog terisi raseste janalaku mana meeda yama attention create chesukovacchu...alanti vyaktullo okaru ee rasp berry ramalindau...mari itanu rasina review sadovoccha ante sadavocchu..circus lo joker ni choosinattu choosi navvukodanikenandoi...

    review mottam chadivte okkati manaku sarigga ardamvutundi idi mana tv9 vallu cheppina kula gajji discease ki emaina example aa ani..ehdukante mana ramalingadu tana kulam vallu natinchia sinemalu gabbilalu kooda soodataniki bayapadutunte vatiki songa karustu chooseyyagaladu ade vere kulam valla simealu hit avute adedo swine flu vacchina kaki la gila kottukuntadu...sinema pettina paisalu vaccha janalaku entertainment icchaya leda anna redu vishayala paina adharapadutundi...aa rendu ee sinemalo pushkalam ga unnayi...keep buring

    ReplyDelete
  11. Great review with funny comments.,
    I like it sir . Keep it up

    ReplyDelete
  12. tereeeeeeeeeeeee

    ReplyDelete
  13. cenima epudu (e roju ki kuda)hyd lo house full exta shows vaystunaru
    ne review chadalydymo
    egg cenima alaundo chypu
    ne tast super....

    ReplyDelete