"వంటింటి కుందేలు" ఈ మాట ఎవరన్నారో నాకు తెలీదు కానీ, ఆ మాట అన్నవారు ఆ తర్వాతి నుంచి తామే వంట వండుకొని తిన్నారో లేదా వాళ్ళు పేర్కొన్న వంటింటి కుందేళ్ళతో వండించుకొని తిన్నారో అన్న విషయం నాకు తెలియదు. కానీ ఆ ఒక్క మాటతో అప్పటిదాకా ఎన్నో వేల సంవత్సరాలుగా కుటుంబానికి సేవలందించిన స్త్రీలను అవమానించారని నా అభిప్రాయం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మొత్తం తినే తిండి మీదనే ఆధారపడి ఉంటుంది. మరి అంతమంది ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి కాబట్టి ఈ సమాజంలో స్త్రీ అనే వ్యక్తి తీసుకున్నారు. ఆ వంటకు కావల్సిన సరంజామాను తెచ్చే బాధ్యత పురుషుడు తీసుకున్నాడు.
నేను గమనించినంతలో, కుటుంబం మొత్తానికి వంట చెయ్యాలంటే రోజూ దాదాపు ఎనిమిది గంటలనుండి పదిగంటల సమయం కేటాయించవలసి ఉంటుంది (including పాత్రలు తోమడం వగైరా). అంత సమయం కేటాయిస్తూ ఇతర పనులు చెయ్యాలంటే కష్టమే కాబట్టి ఒక జాతి మొత్తం ఆ ఒక్కపనికే అంకితమయ్యింది అనుకుంటున్నాను. కానీ రాను రానూ ఆ పనిమీద చులకన భావం ఏర్పడి ఉండొచ్చు. ఎందుకంటే, ఆ పని చేసేవారు ఖచ్చితంగా ఇతరుల మీద ఆధారపడవలసి ఉంది కాబట్టి. సంపాదించేవాడు ఎక్కువ, ఇతర పనులు చేసేవారు తక్కువ అన్న అభిప్రాయం తప్పు అని చెప్పడానికేనేమో వేమన గారు "చీపురుతో శుభ్రపరచడం, ఆఫీసులో పని చెయ్యడం..రెండిట్లో ఏదీ తక్కువ కాదు, అన్నీ సమానమేనంటూ ఏదో పద్యం చెప్పారు. నాకు గుర్తు లేదు.
ఇప్పుడీటాపిక్ మీద టపా రాయడానికి కారణమేమిటంటే, మొన్నామధ్య ఒక విషయం తెలిసింది. కొద్దిమంది వారానికి కనీసం మూడు రోజులైనా ఇంట్లో వండుకోవాలనే నియమం పెట్టుకున్నారట. కారణం అందరికీ తెలిసిందే, ఎవరి పని వాళ్లది, ఎవరి ఇగో వాళ్ళది. అరె! సంపాదన కోసం వంటకు ఇంత లీస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనిపించింది.
బహుశా అందుకేనేమో ఈ మధ్యకాలంలో ఇబ్బడిముబ్బడిగా రెస్టారెంట్స్ వెలుస్తున్నాయి. ఈకాలంలో ఫుడ్ బిజినెస్ పెట్టుకున్నోడు ఎవ్వడూ నష్టపోడు. నాదీ గ్యారెంటీ. కానీ, ఆ రెస్టారెంట్స్‌లోనూ, ఫైవ్ స్టార్ హోటల్స్ లోనూ తినేవి రుచికరంగా ఉంటున్నాయా, కడుపు నింపగలవా?
ఆకలైనప్పుడు హైద్‌లో ఏ రెస్టారెంట్‌లో తినాలీ, ఏ హోటల్లో బఫే బాగుంటుంది అని ఎక్కడక్కడో ఊరంతా తిరిగేవాళ్లం. ఎంత ఖర్చుపెట్టినా బఫే పేరుతో పీకల్దాకా మెక్కినా ఏనాడూ ఎవ్వరమూ కూడా సంతృప్తి చెందలేదు. ఇంట్లో చేసుకునే పచ్చడి మెతుకులకు అన్నీ క్రిందే అనిపించాయి.
స్త్రీవాదులవల్లనైతేనేమీ, ఇతర వాదులవల్లనైతేనేమీ వంట పని మీద చులకన భావం చాలామందిలో ఏర్పడిందని అనుకుంటున్నాను. ఆడది అబల కాదు, సబల, శక్తి, శాకినీ, ఢాకిని అని నూరిపోసి నాలుగ్గోడల మధ్య వంట చెయ్యడం తప్పు అనే అభిప్రాయం ఎక్కించడంలో కాస్తో కూస్తో సఫలమయ్యారని అనుకుంటున్నాను. ఆర్థికంగా తమ కాళ్ళమీద నిలబడ్డమనడంలో తప్పులేదు, కానీ ఇక్కడ అలాకాకుండా బలప్రదర్శన చెయ్యడం స్టార్ట్ చేశారు. మగాడు అంతరిక్షంలోకి వెళితే ఆడదీ వెళ్ళింది చూశారా...మగాడు మందుకొడితే మేమూ కొట్టాం అంటూ ఒకరినొకరి మధ్య బలప్రదర్శనలెక్కువైపోయాయి తప్ప ఫలానా విధంగా స్వంతంగా కాళ్ళమీద నిలబడితే ఉపయోగం ఏమిటీ అని స్పష్టంగా చెప్పడం నేను చూడలేదు. ఎవరి మీదనో ఆధారపడితే ఆ ఆధారం ఏ కారణం చేతనైనా కూలిపోతే పరిస్థితి ఏమిటి? అందుకే స్వంతంగా సంపాదించే నేర్పు కలిగి ఉండాలి అని చెప్పడం నేను చాలా తక్కువగా చూశాను.
(బ్లాగుల్లో ఇటువంటి టపా రాయడం ఇదే మొదటిసారి. ఇప్పటికే పెద్దదైపోయింది. సశేషం)

LOL
ReplyDeleteఆవిడ ఏడుస్తోందా? పిల్లిలా మొహం కడుక్కుంటోందా అనేది అర్థం కాలా! మొహం బొబ్బలెక్కి పోదూ?!
ReplyDelete:))) గంగ కంట ఒలికిన కన్నీటి గంగ
పిల్లి మొహం కడుక్కోవడం మీరెప్పుడు చూశారండి మహా ప్రభో... :-)
Delete/పాత్రలు తోమడం/
ReplyDeleteమరీ బాలయ్య, పవన్ కల్యాణ్, జూ ఎంప్టీఆర్ అభిమానులు బాధ పడతారేమో... 'అంట్లు తోమడం' అంటే అందరికీ అర్థమవుతుంది కదా. :P
గదంతా మాకు తెల్వద్... గిది మా భాష. గిట్లనే మాట్లాడ్తాం. ఇది ఆత్మగౌరవ నినాదం. హా.. :-)
Deleteబ్లాగులో కూడా ఒక హిడింబి ఉందని ఈ టపా లో కింది వ్యాఖ్య చదివిన తరువాత తెలిసింది.
ReplyDeletehttp://jyothivalaboju.blogspot.in/2012/05/blog-post.html
గుడుంబా సేమ్య గారు ఇలా అంట్టున్నారు : భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు వంట కూడా కలిసి చేసుకోవడంలోనే ఆనందం ఉంది. మగవాళ్ళూ వంటలో ఆరితేరినవారే. నలభీములని చెబుతారు కదా. వంటవాళ్లంతా మగవాళ్లే ఉంటారు. కాబట్టి అదేదో వరమో, అదృష్టమో అనుకుని మనకి మనమే కష్టాలు కొనితెచ్చుకోనక్కర్లేదు.
అమ్మా ! గుడుంబా సేమ్య, భార్య ఉద్యోగం చేస్తున్నాది కాబట్టి భర్త కూడా వంట చేయాలా? పెళ్లికిముందు, పెళ్లైన తరువాత భార్యలో లో వచ్చే శారీరక మార్పులు చుస్తే, చాలా మంది భర్తలకి జీవితం మీద విరక్తి కలుగుతుందని తెలియదా? పెళ్లైన అనతి కాలంలో లోనే పెళ్లాం పెద్ద పహిల్వాల్ లాగా తయారౌతుందని ఏ భర్త పెళ్లికిముందు ఊహించుకోడు, తన పరిస్థితిని చూసి కన్నీరు మున్నీరు అవుతూ విషయాన్ని జీర్ణం చేసుకొనే లోపలే మళ్లి వాడికి, వంట చేసే శిక్ష వేస్తారా? ఏవమ్మా మీకు మేము చేసిన అన్యాయం?
అనానిమస్ గారు, కెవ్వ్వ్...వాళ్లంతా ఇస్త్రీవాదులు అట్లనే మాట్లాడతారు. స్త్రీవాదులకు కుటుంబ విలువలు కాదు ముఖ్యం. సమానత్వం పేరుతో చేసే బల ప్రదర్శన ముఖ్యం. ఒకటే మాట,మేమూ సంపాదిస్తున్నాం కదా అంటారు. సంపాదనలో సమానత్వం ముఖ్యం. ఇంకానయం, సమానత్వం పేరుతో జంబలకిడి పంబలో లాగా నొప్పులు ఒకరికి వస్తే బిడ్డ ఇంకోరికి పుట్టేట్లు చెయ్యలేదు ఆ దేవుడు. బహుశా ఈ అన్యాయం చేసినందుకు గానూ రేప్పొద్దున ఆ దేవుడు మీద కోర్టులో కేసేస్తారేమో. :-) ఇల్లు నాలుగ్గోడలు అయినప్పుడు, ఆఫీస్ నాలుగ్గోడలు ఎందుకు కాదు అన్నది నా ప్రశ్న. స్త్రీవాదులకు పనిలో తప్పు జరిగినప్పుడు ఆఫీస్‌లో బాస్ తిడితే సమ్మగా ఉంటుంది, ఇంట్లో మొగుడు తిడితే గృహహింస గుర్తు కొస్తుంది.
Delete*వాళ్లంతా ఇస్త్రీవాదులు అట్లనే మాట్లాడతారు.*
Deleteఅటువంటి వాదనలు ఇక పై చెల్లదు. గుడుంబా సేమ్య పెద్ద లెక్కించ దగ్గది కాదు. మన టార్గేట్ ఓల్గా & companyనే! ఇన్ని రోజులు ప్రింట్ మీడియా అండతో, సాహిత్యం పేరుతో చేలరేగి పోయారు. బ్లాగులో చర్చలకి అందరు స్రీ వాదులను కట్ట కట్టుకొని రమ్మనండి. ఒక పట్టు పడదాము.
అనానిమస్ గారూ, మీరు తగ్గద్దు. అలానే కానీయండి. గృహహింస మీద ఏదో పోస్ట్ పడింది. దానిపైన టార్గెట్ చేద్దాం. గృహహింస పేరుతో కేస్ పెడితే ఎన్ని సంవత్సరాలు బొక్కలో ఏస్తారో మీకేమైనా తెలుసా? :-)
Deleteన్యాయపరమైన అంశాను తాడేపల్లిగారు, శ్రీకాంత్ ను అడగండి. వారికి తెలుసు.
Delete@ఇల్లు నాలుగ్గోడలు అయినప్పుడు, ఆఫీస్ నాలుగ్గోడలు ఎందుకు కాదు అన్నది నా ప్రశ్న.
Deleteఎందుకు కాదు భేషుగ్గా పోల్చుకోవచ్చు,
ఆఫీస్ లో బాస్ కి ఆయన బాస్ ఉన్నాడు. ఇంట్లో బాస్ కి గృహ హింసా చట్టం ఉంది :)
*మగవాళ్ళూ వంటలో ఆరితేరినవారే. వంటవాళ్లంతా మగవాళ్లే ఉంటారు*
ReplyDeleteఆడవాళ్లందరు వంటవాళ్లను పెళ్లి చేసుకొంటే సరి. వీరు బ్లాగుల్లో బజ్జులో చేరి స్రీజాతి సమస్యలను, తన్ హాయి లను కథలు గా రాసుకొంట్టు చర్చించుకోవటానికి చాలా వీలుగా ఉంట్టుంది. ప్రపంచంలో ఇది నాది అని చెప్పుకోనే విధంగా మహిళలు సాధించిన పది రంగాలు కనీసం ఐదు రంగాలు ఎమైనా ఉన్నాయా?
అబ్బే! మగవాడు వంటచేస్తే వాళ్ళూ వంట చేస్తామంటారు. సమానత్వం సమానత్వం ముఖ్యం ఇక్కడ. ఇంక ఎవరేమి సాధించారన్నది ఎందుకులెండి. ఏమి సాధించారనేదానికి ఎవరికీ కొలబద్ధ ఏదీలేదు. అంత ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన విషయం కాదు కూడా నా దృష్టిలో...
Delete@@@@అబ్బే! మగవాడు వంటచేస్తే వాళ్ళూ వంట చేస్తామంటారు. సమానత్వం సమానత్వం ముఖ్యం ఇక్కడ.
DeleteLOL..Nice Post
మగవాడి పవరేమీటో లోకానికి చూపెట్టి, సత్తా చాటిన మన ప్రియతమ నాయకులు యన్.డి. తివారి & యన్.టి. రామారావు లను (70 సంవత్సరాలు + నాటౌట్ )ఆదర్శంగా తీసుకొని ఒక బ్లాగు పెట్టి ఈ వాదనలను చిత్తు చేయాలి.
ReplyDelete